
చాలా మంది బాగానే సంపాదిస్తూ ఉంటారు. ప్రతి నెలా ఫస్టు తారీఖున ఐదెక్కల జీతం అందుకుంటారు. ఈఎంఐలు, ఇంటి అద్దెలు, ఖర్చులు అన్నీ పోను ఓ 30 నుంచి 40 శాతం జీతం మిగులుతుంది. ఆ డబ్బును పొదుపు చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ, ప్రస్తుతం కాలంలో అప్పులు అడిగేవారు ఎక్కువైపోయారు. కొంతమంది సరైన కారణం, అవసరం లేకపోయినా కూడా వారి డాబు కోసం హంగులు ఆర్భాటల కోసం అప్పులు చేస్తుంటారు.
అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. అలా ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అప్పుగా అడిగితే.. తెలిసిన వారే కదా, మన ఫ్రెండే కదా, మనకు కూడా అవసరం వస్తుందేమో, మనం ఒకరినిక సాయం చేస్తే రేపు మనకు వేరే వాళ్లు సాయం చేస్తారంటూ గొప్పలకు పోయి.. అడిగిన వారికల్లా లేదనుకుండా తల ఊపస్తే.. మీ దగ్గరున్నదంతా ఊడ్చేస్తారు. అందుకే కొన్ని సార్లు కొందరికి నో చెప్పడం అలవాటు చేసుకోండి. అప్పుడే మీరు మీ కష్టార్జితాన్ని నష్టపోకుండా ఉంటారు.
నిజంగానే వారికి ఏదైన మెడికల్ ఎమర్జెన్సీ, లేదా ఇతర ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అయితే సాయం చేయండి. కానీ, డబ్బు అంటే లెక్కలేనివారికి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారికి, ఆర్థిక క్రమ శిక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. లేదంటే అప్పు ఇచ్చి.. ఆ తర్వాత వారి నుంచి మీరు డబ్బు అడుక్కోవాల్సి వస్తుంది. అప్పు ఇచ్చి వసూలు చేసుకోవడం ఒక పద్ధతి అయితే.. మొండి బాకీలను అడుక్కోవడం ఇంకో పద్ధతి. రెండో పద్ధతి అస్సలు మంచిది కాదు. అది మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. అందుకే నో చెప్పడం నేర్చుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి