LPG Subsidy Amount: సెప్టెంబర్‌లో దేశీయ LPG సిలిండర్ల ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సబ్సిడీ లేని 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరపై రూ.25 పెంచింది. అదే సమయంలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై రూ.75 పెరిగింది. ఎల్‌పిజి ధరల పెరుగుదల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు ఎల్‌పిజిలో సబ్సిడీ కూడా అందడంలేదు. తాజాగా LPG సబ్సిడీపై MoPNG ఈ -సేవ నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చింది. MoPNG ఈ-సేవ అనేది గ్యాస్, చమురు రంగానికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించే ఒక సంస్థ.
ఎల్పీజీ సబ్సిడీ ఎందుకు రావడం లేదు
ఒక ట్విట్టర్ యూజర్ ఇలా అడిగాడు “ సంవత్సరం నుంచి మాకు LPG గ్యాస్ సబ్సిడీ అందడం లేదు. ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసినా ఎవరు స్పందించడం లేదని ట్వీట్ చేశాడు. దీనికి ప్రతిస్పందించిన MoPNG ఈ -సేవ ఇలా ట్వీట్ చేసింది. “ప్రియమైన కస్టమర్ సబ్సిడీ సిలిండర్, సబ్సిడీ లేని సిలిండర్ ధరల మధ్య మే 2020 నుంచి వ్యత్యాసం లేనందున సబ్సిడీ మొత్తం ఏ కస్టమర్‌కు బదిలీ చేయడంలేదని ప్రకటించింది ” అయితే సమాచారం ఇవ్వడానికి ఈ సంస్థ అందుబాటులో ఉంటుందా అని సదరు వినియోగదారు ప్రశ్నించాడు.
దీనిపై MoPNG ఈ -సేవా స్పందిస్తూ కస్టమర్ వివరాలను కోరింది. MoPNG ఈ -సేవ ఇలా ట్వీట్ చేసింది దయచేసి మీ 16 అంకెల LPG ID, ఏజెన్సీ పేరు, జిల్లా, స్థానం, మీ ఫోన్ నంబర్‌ని మాకు పంపమని కోరింది. సబ్సిడీ స్థితిని తెలుసుకోవాలనుకుంటే ఎవ్వరైనా ఈ పని చేయవచ్చని ప్రకటించింది. LPG పై సబ్సిడీ ఎందుకు రావడం లేదని చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ రోజు అధికారికంగా సమాధానం వచ్చింది. సెప్టెంబర్ నెలలో ఎల్‌పిజి ధరల పెంపునకు ముందు ఆగస్టు 18 న ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.25.50 పెరిగిన విషయం తెలిసిందే.
पिछले 1 साल से अधिक समय हो गया हैं लेकिन हमे एलपीजी गैस सिलिंडर की सब्सिडी नहीं मिली हैं मैने ऑनलाइन पोर्टल पे कम्प्लेन की लेकिन कोई जवाब नहीं मिला ही ! @MoPNG_eSeva @IndianOilcl
— Urvish Nandola (@Urvishnandola) August 29, 2021