Indian Railways: మీరు వెళ్లే రైలు రద్దు అయితే రీఫండ్‌ పొందడం ఎలా? నియమాలు ఏంటి?

వర్షాకాలంలో వాతావరణ పరిస్థితుల కారణంగా రైలు సేవలు తరచుగా ఆలస్యం లేదా రద్దు అవుతుంటాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం మొదలైన కారణాల వల్ల ఈ కాలంలో రైలు రద్దు కావచ్చు. రైలు సర్వీసులను రద్దు చేయడానికి లేదా దారి మళ్లించడానికి అనేక కారణాలు ఉన్నాయి. రైలు సర్వీస్ రద్దు అయితే లేదా మీరు ప్రయాణించాల్సిన రైలు..

Indian Railways: మీరు వెళ్లే రైలు రద్దు అయితే రీఫండ్‌ పొందడం ఎలా? నియమాలు ఏంటి?
Indian Railways

Updated on: Aug 11, 2024 | 12:33 PM

వర్షాకాలంలో వాతావరణ పరిస్థితుల కారణంగా రైలు సేవలు తరచుగా ఆలస్యం లేదా రద్దు అవుతుంటాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం మొదలైన కారణాల వల్ల ఈ కాలంలో రైలు రద్దు కావచ్చు. రైలు సర్వీసులను రద్దు చేయడానికి లేదా దారి మళ్లించడానికి అనేక కారణాలు ఉన్నాయి. రైలు సర్వీస్ రద్దు అయితే లేదా మీరు ప్రయాణించాల్సిన రైలు రద్దు చేయబడితే, మీరు మీ టికెట్ డబ్బును ఎలా తిరిగి పొందుతారు అనే ప్రశ్న మీకు తరచుగా వచ్చే ప్రశ్న?

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలు మార్గం మారినప్పుడు లేదా రద్దు చేయబడినప్పుడు టిక్కెట్లు తిరిగి చెల్లిస్తుంది రైల్వే శాఖ. దీని కోసం మీరు టీడీఆర్‌ ఫైల్ చేయాలి. రైలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే, టిక్కెట్లు పూర్తిగా వాపసు చేస్తారు. అయితే, మీ ప్రాంతంలో వరద పరిస్థితి ఉంటే, మీరు ఏ కారణం చేతనైనా స్టేషన్‌కు వెళ్లలేకపోతే లేదా రైలు పట్టుకోలేకపోతే, రైల్వేలకు తెలిజేయాలి. అయితే, ఈ సందర్భంలో టిక్కెట్‌ను పూర్తిగా రీఫండ్‌ చేసే అవకాశాలు చాలా తక్కువ.

ఇది కూడా చదవండి: Post Office scheme: ఈ స్కీమ్‌తో లక్షాధికారి కావచ్చు.. రూ.7 వేల పెట్టుబడితో చేతికి రూ.12 లక్షలు!

ఇవి కూడా చదవండి

టీడీఆర్‌ (TDR) అంటే ఏమిటి?

TDR అనేది టిక్కెట్ రద్దు ప్రక్రియ. టీడీఆర్‌లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సిస్టమ్‌ల ద్వారా ఫైల్ చేయవచ్చు. రైలు షెడ్యూల్ చేసిన సమయానికి 1 గంట ముందు టీడీఆర్‌ తప్పనిసరిగా సమర్పించాలి. మీ టికెట్ 60 రోజులలోపు మీ ఖాతాలో జమ అవుతుంది.

టీడీఆర్‌ ఎలా ఫైల్ చేయాలి?

  • ముందుగా మీ IRCTC ఖాతాకు లాగిన్ చేయండి.
  • బుక్ చేసిన టికెట్ చరిత్రపై క్లిక్ చేయండి.
  • రైలు PNR నంబర్‌ను నమోదు చేసి, ఆపై “ఫైల్ TDR” ఎంపికపై క్లిక్ చేయండి.
  • టీడీఆర్‌ ఎవరి పేరు మీద ఫైల్ చేయాలో ప్రయాణికుడి పేరును నమోదు చేయండి.
  • టీడీఆర్‌ ఫైల్ చేయడానికి కారణాన్ని ఎంచుకోండి లేదా అదర్‌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ కారణాన్ని నమోదు చేయండి.
  • తర్వాత సబ్మిట్‌ ఎంపికపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు ఒక టెక్స్ట్ బాక్స్ తెరుచుకుంటుంది. ఇక్కడ టిక్కెట్ రద్దు కారణాన్ని నమోదు చేసి సమర్పించండి. అప్పుడే టీడీఆర్‌ ఫైల్‌ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి