SIP: కోటి రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా.. అయితే ఇది తెల్సుకోవాల్సిందే..

|

Jan 20, 2022 | 5:59 PM

వ్యూహత్మకంగా పెట్టుబడులు పెడితే మంచి ఆదాయం ఆర్జించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు...

SIP: కోటి రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా.. అయితే ఇది తెల్సుకోవాల్సిందే..
Mutual Fund
Follow us on

వ్యూహత్మకంగా పెట్టుబడులు పెడితే మంచి ఆదాయం ఆర్జించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మ్యూచువ‌ల్ ఫండ్లలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే కాంపౌండింగ్ ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలంలో మంచి రాబడి పొందేందుకు ఆస్కారం ఉంటుందని వివరిస్తున్నారు. అందుకే పెట్టబడిదారులు సిప్ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్లలో దీర్ఘకాలం పాటు మ‌దుపు చేస్తారు. అయితే ఇలా మ‌దుపు చేసే వారిలో ఎంతమంది వారి ఆదాయం పెరిగిన‌ప్పుడు సిప్ మొత్తాన్ని పెంచుతున్నారనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఆదాయం పెరిగిన‌ప్పుడ‌ల్లా సిప్ మొత్తాన్ని పెంచితే త్వరగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు

పెట్టుబడిదారులు 10 సంవ‌త్సరాలు, అంత‌కంటే ఎక్కువ కాలం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే రిస్క్ సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి 8 నుంచి 12 శాతం వరకు ఆదాయం పొందేందుకు అవ‌కాశం ఉంది. అయితే 40 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చేస‌రికి రూ.1 కోటి పొందాలన్న లక్ష్యం ఉన్న వారు కాస్త రిస్క్‌ తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు ఒక మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. రిస్క్ పరిమితిని బట్టి ఇండెక్స్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు.
రూ.1 కోటి ల‌క్ష్యంతో మదుపు ప్రారంభించిన వారు అనుకున్న స‌మ‌యానికి త‌మ ల‌క్ష్యానికి చేరువయ్యేందుకు సాధార‌ణ మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ స‌రిపోదు. ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లలో దీర్ఘకాలంలో 12 శాతం సగటు రాబ‌డి ఆశించొచ్చు. అలాగే, క‌నీస నెల‌వారీ పెట్టుబ‌డితో సిప్‌ను ప్రారంభించి లక్ష్యాన్ని సాధించేందుకు పెట్టుబడిదారులు
ఒక వ్యక్తి తన 25 సంవత్సరాల వయసులో సిప్ చేయ‌డం ప్రారంభిస్తే, 12 శాతం వార్షిక రాబడి అంచనాతో 40 ఏళ్ల వయసుకు, అంటే త‌రువాతి 15 సంవత్సరాల్లో రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రారంభంలో నెలకు రూ.9,000 పెట్టుబడి పెట్టాలి. అనంతరం దాన్ని పెంచుకుంటూ పోవాలి.

Read Also.. Medicine: నకిలీ మందులను ఇలా సింపుల్​గా గుర్తించండి.. జస్ట్ స్కాన్ చేస్తే చాలు..