Cashless Withdraw: ఏటియం కార్డు లేదా? పర్లేదు.. ఫోన్ తోనే క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు!

మనదేశంలో పెమెంట్ సిస్టమ్ అంతా ఆన్ లైన్ అయినా.. క్యాష్ కావాలంటే మాత్రం ఇప్పటికీ ఏటియం కార్డు ఉండాల్సిందే.. అందుకే ఈ విధానాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ తో స్కాన్ చేసి డబ్బు విత్ డ్రా చేసుకునే విధానాన్ని తీసుకురాబోతున్నారు.

Cashless Withdraw: ఏటియం కార్డు లేదా? పర్లేదు.. ఫోన్ తోనే క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు!
Card Less Cash Withdraw

Updated on: Sep 18, 2025 | 12:53 PM

ప్రస్తుతం ఎక్కడికెళ్లినా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంతో చిటికెలో పేమెంట్ చేసేయొచ్చు. కానీ ఏదైనా అవసరం పడి క్యాష్ కావాలంటే మాత్రం దానికి ఖచ్చితంగా ఏటీయం కార్డు ఉండాల్సిందే.  క్యాష్ విత్ డ్రా కూడా యూపీఐతో చేసుకోగలిగితే చాలా బాగుటుంది కదా.. అందుకే ఈ విధానం అమలులోకి తీసుకురావడంపై పని చేస్తుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).

ఏటియం కార్డుతో పని లేకుండా క్యాష్ విత్ డ్రా చేసుకునేలా ఓ కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీనికోసం కొత్తగా 20 లక్షలకు పైగా అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ అవుట్ లెట్ల సాయంతో ప్రజలు నేరుగా ఫోన్ యూపీఐ యాప్ ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. బ్యాంకులు, ఏటీయం లు అందుబాటులో లేని చోట్ల వీటిని ఎక్కువగా ఏర్పాటు చేయనున్నారు.

అవుట్‌లెట్ అంటే..

ప్రస్తుతం ఉన్న ఏటియం సెంటర్లలో యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే  ఫీచర్ అందుబాటులో లేదు. కొన్ని చోట్ల మాత్రమే యూపీఐ ఎనేబుల్డ్ ఏటీయంలు ఉన్నాయి. అవి కూడా కేవలం వ్యాపారస్తులకే అందుబాటులో ఉన్నాయి.  కాబట్టి దీనికోసం కొత్తగా బిజినెస్ కరస్పాండెంట్ అవుట్ లెట్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ అవుట్‌లెట్‌ల ద్వారా ఒకేసారి  రూ. 10,000 వరకు డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.

షాపు ఓనర్లు, వ్యాపారులు ఈ బిజినెస్ అవుట్ లెట్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అనుమతి పొందిన వారికి  పాయింట్-ఆఫ్-సేల్ మెషీన్‌లు ఇస్తారు. దానికి లింక్ చేసి ఒక  క్యూఆర్(QR)  కోడ్ కూడా ఇవ్వబడుతుంది.  కస్టమర్లు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలతో వంటి ఇతర యూపీఐ యాప్స్ ఉపయోగించి.. యూపీఐ క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ తరహా కార్డ్ లెస్ క్యాష్ విత్‌డ్రాపై బ్యాంకులు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయవు. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు విత్ డ్రా కోసం ఇబ్బందులు పడుతున్నవారికీ, ఏటియం కార్డులు వాడడం తెలియని వారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి