NPS: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో చందాదారుడు మరణిస్తే.. డెత్‌ బెనిఫిట్స్‌ పొందడం ఎలాగో తెలుసుకోండి

|

Jan 07, 2023 | 6:35 AM

National Pension System: భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం చాలా మంది నేషనల్‌ పెన్షన్ సిస్టమ్‌లో తమ నగదు పొదుపు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ పథకంలో పొదుపు చేసిన చందాదారుడు మరణిస్తే అతడి డెట్‌ బెనిఫిట్స్‌ ఎలా పొందాలనే విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా ఏదైనా..

NPS: నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో చందాదారుడు మరణిస్తే.. డెత్‌ బెనిఫిట్స్‌ పొందడం ఎలాగో తెలుసుకోండి
Nps Scheme
Follow us on

National Pension System: భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం చాలా మంది నేషనల్‌ పెన్షన్ సిస్టమ్‌లో తమ నగదు పొదుపు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ పథకంలో పొదుపు చేసిన చందాదారుడు మరణిస్తే అతడి డెట్‌ బెనిఫిట్స్‌ ఎలా పొందాలనే విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా ఏదైనా పొదుపు పథకాల్లో ఖాతాదారుడు లేదా చందాదారుడు మరణిస్తే అతడు పొదుపు చేసిన నగదు మరణాంతరం కుటుంబ సభ్యులు లేదా నామినిగా పొందుపర్చిన వ్యక్తికి అందజేశారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది. ఈ ఇదొక స్వచ్చంద రిటైర్ మెంట్ ప్రొగ్రామ్. ఇది మార్కెట్ బేస్డ్ రిటర్న్స్ ను అందిస్తుంది. ఈ పథకంలో చేరిన వారికి రిటైర్ మెంట్ అనంతరం పెన్షన్ తో పాటు, మరణం సంభవిస్తే నామినీ లేదా చట్టబద్ధ వారసులకు పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది. ఇందులో చందాదారులు స్వయంగా ఇన్వెస్ట్ మెంట్ వ్యూహాలను, రిటైర్ మెంట్ ఫండ్ ను రూపొందించుకోవచ్చు.

ప్రభుత్వేతర రంగంలో ఉన్న నేషనల్‌ పెన్షన్ సిస్టమ్‌ చందాదారుడు మరణిస్తే, ఆ వ్యక్తి నామినీ కానీ, చట్టబద్ధ వారసులు కానీ డెత్ బెనిఫిట్స్ పొందవచ్చు. డెత్ బెనిఫిట్స్ లో మొత్తం డబ్బును ఒకేసారి పొందవచ్చు. లేదా పెన్షన్ పొందడానికి వీలుగా యాన్యుటీని కొనుగోలు చేసుకోవచ్చు. నామినీ లేదా చట్టబద్ధ వారసులు చనిపోయిన చందాదారుడి డెత్ సర్టిఫికెట్ ను సంబంధిత అధికారుల నుంచి తీసుకోవాలి. ఎన్పీఎస్‌ చందాదారుడు ఇఎన్‌పిఎస్‌ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకుని ఉంటే, అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి విత్ డ్రా ఫామ్ ను ఫిల్ చేసి, ఎన్పీఎస్ ట్రస్ట్‌కు సబ్‌మిట్ చేయాలి.

విత్ డ్రాయల్ ఫామ్ తో పాటు డెత్ సర్టిఫికెట్ ను, నామినీ లేని పక్షంలో చట్టబద్ధంగా తామే వారసులమని నిర్ధారించే పత్రాలను, కేవైసీ డాక్యుమెంట్స్ ను, బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి. Www.npscra.nsdl.co.in వెబ్ సైట్ నుంచి విత్ డ్రా ఫామ్ ను డౌల్ లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫామ్ లోనే అవసరమైన డాక్యుమెంట్ల లిస్ట్ కూడా ఉంటుంది. అవసరమైన వెరిఫికేషన్ పూర్తయిన తరువాత డెత్ బెనిఫిట్స్ గా అందే మొత్తం నామినీ లేదా చట్టబద్ధ వారసుల బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..