Term Life Insurance: ప్రస్తుతం పరిస్థితుల్లో బీమా పాలసీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది బీమా పాలసీలు తీసుకుంటున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ సహాయంతో మీరు మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తారు. పాలసీదారుడు మరణించిన సమయంలో కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. పెట్టుబడి పెట్టడం ప్రారంభించినప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలని ఆర్థిక నిపుణులు ఎల్లప్పుడూ సిఫార్సు చేస్తుంటారు. అలాంటి సమయంలో ఇతర ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్‌లను కూడా చూస్తుండాలి.
పాలసీదారు మరణించిన సందర్భంలో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేలా చేస్తుంది. ఈ బీమా పాలసీ చాలా సులభం, అలాగే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత కుటుంబం ఆర్థికంగా లాభం పొందుతుంది. పిల్లల చదువులు, ఇంటి అవసరాలు, పిల్లల వివాహాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే ముందు ప్రత్యేకంగా పరిగణించవలసిన విషయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ, కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడం చాలా చోట్ల జరుగుతుంటుంది. ఇలాంటి సమయంలో కుటుంబం ఇబ్బందుల్లో పడిపోతుంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ మీ వార్షిక ఆదాయం కంటే కనీసం 8-10 రెట్లు ఎక్కువగా ఉండాలని ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
బీమా కాల వ్యవధిని కూడా గుర్తుంచుకోండి
ఇది కాకుండా, పాలసీ వ్యవధిని కూడా గుర్తుంచుకోవాలి. మీకు తక్కువ వయసు ఉంటే పాలసీ వ్యవధి ఎక్కువ ఉండాలి. మీ వయస్సు ఎక్కువగా ఉంటే పాలసీ వ్యవధి తక్కువగా ఉండాలి.
ఎటువంటి సమాచారాన్ని దాచవద్దు
మీరు పాలసీ తీసుకునే ముందు మీరు ఎలాంటి సమాచారాన్ని దాచవచ్చు. మీకు ఉన్న సమస్యలను పాలసీ ఏజెంటుకు తెలియజేయాలి. మీకు ఉన్న సమస్యలను తెలియజేసి ఏవైనా అనుమానాలుంటే ముందుగానే తెలుసుకోవాలి. ముఖ్య విషయం ఏంటంటే పాలసీదారు తీవ్రమైన అనారోగ్య సమస్యలుంటే అలాంటివి వారి ముందు బహిర్గతం చేయాలి. ఇలాంటి విషయాలు దాచినట్లయితే క్లెయిమ్ విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తినితనిఖీ చేయాలి.
మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తున్న కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని తప్పకుండా తనిఖీ చేయండి. కంపెనీకి మంచి సెటిల్‌మెంట్ రేషియో ఉంటే, దాని నుండి పాలసీని కొనుగోలు చేయండి. ఈ నిష్పత్తి ఆ పరిస్థితిలో మీ కుటుంబం పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన అవసరం లేదని మీకు హామీ ఇస్తుంది.
ఇవి కూడా చదవండి