ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్) ఫైలింగ్ పూర్తి చేసేసి.. రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? ఐటీఆర్ ఫైల్ చేసి చాలా కాలం అయినా ఇంకా రిఫండ్ కాలేదని ఆందోళన చెందుతున్నారా? అయితే మీరు మొదటి ఓ విషయాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. మీరు ఐటీఆర్ రిఫండ్ కు అర్హులు అయితే మీరు ఐటీఆర్ ను ఈ-వెరిఫై చేశారో లేదో తనిఖీ చేసుకోండి. మీరు ఐటీఆర్ రిటర్న్ దాఖలు చేసినప్పటికీ ఈ-వెరిఫై చేయకపోతే ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్ అసంపూర్తిగానే ఉంటుంది. అందుకే మీరు ఒకవేళ ఐటీఆర్ రిటర్న్ దాఖలు చేసినా.. ఈ-వెరిఫై చేశారోలేదో తనిఖీ చేసుకోండి. అలాగే రిఫండ్ మెసేజ్ కోసం ఎదురుచూస్తున్న వారికి కొన్ని ఫిషింగ్ మెసేజ్ లు వస్తున్నాయని ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్(పీఐబీ ఫ్యాక్ట్ చెక్) నివేదించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు వచ్చిన మెసేజ్ లను షేర్ చేస్తూ పన్ను చెల్లింపు దారులను హెచ్చరించింది. అటువంటి మెసేజ్ లను నమ్మి లింక్ లను క్లిక్ చేస్తే దెబ్బతింటారని చెప్పింది. ఆదాయ పన్ను శాఖ రిఫండ్ లకు సంబంధించి ఎటువంటి మెసేజ్ లుచేయదని గుర్తు చేసింది.
వాస్తవానికి మీరు ఐటీఆర్ దాఖలు చేసిన వెంటనే మీరు రిఫండ్ రాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చెల్లించిన పన్నుల వివరాలను ఆదాయపు పన్ను శాఖ దానితో అందుబాటులో ఉన్న సమాచారం నుంచి ధ్రువీకరించిన తర్వాత మీకు రిఫండ్ జారీ చేస్తుందని వివరిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన దాని ప్రకారం 61% ఈ-వెరిఫై చేసిన రిటర్న్‌లు ఇప్పటికే ప్రాసెస్ అయ్యాయి – అంటే ప్రాసెసింగ్, రీఫండ్ లేదా అడ్జస్ట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం తప్పనిసరిగా పంపబడి ఉండాలి. ఏదైనా సాధారణంగా క్రెడిట్ చేయబడితే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ తర్వాత 10 రోజుల నుంచి 2 వారాల మధ్య మీకు రిఫండ్ జమ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా, మీ ఐటీఆర్ని ఫైల్ చేసి, వెరిఫై చేసిన తర్వాత రిఫండ్ మీకు అందడానికి కనీసం 20 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. అయితే అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఆదాయపు పన్ను రిటర్న్స్ ప్రాసెసింగ్‌ను పన్ను శాఖ వేగవంతం చేసింది . ఫలితంగా, సగటు ప్రాసెసింగ్ సమయం కేవలం 16 రోజులకు తగ్గింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..