
రైలు ప్రయాణాలు చేసేటప్పుడు చాలామందికి రూమ్ అవసరమవుతుంది. ట్రైన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు స్టేషన్‌లో రెస్ట్ తీసుకునేందుకు రూమ్ కోసం వెతుకుతూ ఉంటారు. బయట హోటల్స్‌లో రూమ్ తీసుకోవాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఏసీ రూమ్, మంచి లగ్జరీ రూమ్ కావాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ రైలు ప్రమాణం చేసే సమయంలో స్టేషన్‌లో విశ్రాంతి తీసుకోవాలంటే కేవలం రూ.100కే లగ్జరీ సౌకర్యాలతో కూడిన రూమ్ పొందవచ్చు. వీటినే రిటైరింగ్ రూమ్స్ అంటారు. ఈ విషయం చాలామందికి తెలియక ఉపయోగించుకోలేరు. వీటిని ఆన్‌లైన్ ద్వారా సులువుగా బుక్ చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.
-ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
-మై బుకింగ్స్‌లోకి వెళ్లండి
-మీరు టికెట్ బుకింగ్ చేసుకున్న దగ్గర క్రింద రిటైరింగ్ రూమ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది
-రిటైరింగ్ రూమ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి
-మీ టికెట్ పీఎన్ఆర్ నెంబర్ సెర్చ్ చేయండి
-స్టేషన్‌ను ఎంచుకోండి
-చెక్ ఇన్, చెక్ అవుట్, ఏసీ, నాన్ ఏసీ లాంటి వివరాలు ఎంటర్ చేయండి
-రూమ్‌లు ఖాళీగా ఉన్నాయా.. లేవా అనేవి కనిపిస్తాయి
-ఖాళీగా ఉంటే సెలక్ట్ చేసుకుని ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేయండి
సాధారణంగా ధరలు రూ.100 ఉంటాయి. అయితే ప్రాంతం, డిమాండ్‌ను బట్టి రిటైరింగ్ రూమ్ ధరలు రూ.700 వరకు ఉంటాయి. సింగిల్, డబుల్, ఏసీ, నాన్ ఏసీ రూమ్‌లు ఉంటాయి. మీకు నచ్చినవాటిని మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక రూముల్లో టీవీ, ఇంటర్నెట్, బెడ్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ట్రైన్ ఆలస్యమైనప్పుడు లేదా ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు ఈ రూమ్స్ దాదాపు అన్ని ప్రధాన స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి. ఇక ఆప్ లైన్ లో స్టేషన్ సిబ్బందిని సంప్రదించి కూడా ఈ రూమ్స్ పొందవచ్చు.