Business Idea: మీకు అధికంగా సంపాదించాలని ఉందా..? ఈ బిజినెస్‌తో అద్భుతమైన లాభాలు!

|

May 26, 2023 | 7:00 AM

మంచి రాబడి పొందాలంటే రకరకాల బిజినెస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని బిజినెస్‌లు రిస్క్‌తో కూడుకున్నవి ఉండగా, మరికొన్ని బిజినెస్‌లు సులభంగా డబ్బు సంపాదించేవి ఉంటాయి. ఈ రోజుల్లో ఉద్యోగులు కూడా..

Business Idea: మీకు అధికంగా సంపాదించాలని ఉందా..? ఈ బిజినెస్‌తో అద్భుతమైన లాభాలు!
Business Idea
Follow us on

మంచి రాబడి పొందాలంటే రకరకాల బిజినెస్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని బిజినెస్‌లు రిస్క్‌తో కూడుకున్నవి ఉండగా, మరికొన్ని బిజినెస్‌లు సులభంగా డబ్బు సంపాదించేవి ఉంటాయి. ఈ రోజుల్లో ఉద్యోగులు కూడా బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మంచి లాభాలు ఇచ్చే వ్యాపారం విషయానికొస్తే.. బిర్యానీ ఆకు అనేది అందరికి తెలిసిందే. దీనిని సాగులో కూడా మంచి లాభాలు పొందవచ్చంటున్నారు వ్యాపార నిపుణులు. బిర్యానీ ఆకును వంటల్లో ఉపయోగిస్తారనే విషయం అందరికి తెలిసిందే. అయితే దీనిని ఎలా సాగు చేస్తారు…? ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది..?ఎంత లాభం వస్తుందనే విషయాలను తెలుసుకుంటే ఈ సాగును సులభంగా చేసుకోవచ్చు. ఈ బిర్యానీ ఆకు పంట ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు.

కేవలం 50 మొక్కలు నాటడం ద్వారా మీరు దాని ఆకుల నుండి ప్రతి ఏడాది రూ.1.50 లక్షల నుండి 2.50 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహాయం చేస్తుంది. ఈ పంట సాగు కోసం మొదట్లో కష్టపడాల్సి ఉంటుంది. మొక్క పెరిగేకొద్దీ మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి. ఈ బిర్యానీ ఆకు సాగులో ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ అందిస్తుంది. దీనికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అయితే బిర్యానీ ఆకును పండించడం చాలా సులభం. అదనంగా, దాని సాగు కూడా చాలా చౌకగా ఉంటుంది. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు.

జాతీయ ఔషధ బోర్డు నుంచి సబ్సిడీ:

బిర్యానీ ఆకుల సాగును ప్రోత్సహించేందుకు జాతీయ ఔషధ మొక్కల బోర్డు ద్వారా 30 శాతం సబ్సిడీని రైతులకు అందజేస్తారు. ఒక అంచనా ప్రకారం.. ఒక మొక్క ప్రతి సంవత్సరం సుమారు 3000 నుండి 5000 రూపాయల వరకు సంపాదిస్తుందని ఔషద మొక్కల బోర్డు ద్వారా సమాచారం. 50 మొక్కల నుండి ఏడాదికి 1.50 లక్షల నుండి 2.5 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వ్యాపార నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత వ్యాపార నిపుణుల ద్వారా తెలుసుకోండి.)