భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ బంగారం అత్యవసర పరిస్థితుల్లోనూ ఉపయోగపడుతుంది. బంగారాన్ని ఆభరణాలు, నాణేల రూపంలో కొనుగోలు చేస్తారు. ఇది వాటిని భవిష్యత్తులో ఉపయోగించుకునేలా చేస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అలాగే వ్యాపారస్తులకు కూడా ఇబ్బందిగా మారింది. సరైనా వ్యాపారం జరగక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో బంగారం బాధిత కుటుంబాలకు ఆసరాగా మారింది. మీకు కావలసినప్పుడు మీరు బంగారాన్ని అమ్మవచ్చు.. మీరు బంగారంపై రుణం కూడా తీసుకోవచ్చు. గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీ మన్నపురం నివేదిక ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోని మొత్తం బంగారం హోల్డింగ్‌లలో భారతీయ కుటుంబాలు 12.9 శాతం వాటా కలిగి ఉన్నాయి. 2022 సంవత్సరంలో దాని వాటా 13.6 శాతానికి పెరిగింది. 2026-27 నాటికి ఈ సంఖ్య 14.1 శాతానికి చేరుతుందని అంచనా.
వ్యక్తిగత ఆర్థిక నిపుణులు జితేంద్ర సోలంకి ఇలాంటి వాటిపై పలు విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో లిక్విడిటీ అవసరాలను తీర్చడానికి బంగారు రుణాలు మంచి ఎంపిక అని చెప్పారు. ఈ ప్రయోజనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ఇది సమర్థవంతమైన ఆప్షన్. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు దాని ధరలో 75 శాతం వరకు సులభంగా రుణాలు ఇస్తాయి. ధర, రుణం ఈ నిష్పత్తిని విలువకు రుణం అని అంటారు.
బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ నుండి బంగారు రుణం తీసుకోవాలా? అంటే అది పెద్దగా పట్టింపు లేదని సోలంకి చెప్పారు. రుణం తీసుకునేటప్పుడు ఈ లోన్ చౌక ధరకు, సులభ నిబంధనలపై ఎక్కడ లభిస్తుందో చూడండి. వడ్డీ, అసలు మొత్తం చెల్లింపులో మీకు ఎక్కడ సౌలభ్యం లభిస్తుంది..? బంగారు రుణాలను నియత్రించే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నియమాలు దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం బ్యాంకుల బంగారు రుణాలపై వడ్డీ రేట్లు 7,15 శాతం మధ్య ఉన్నాయి. అయితే, ఎన్‌బీఎఫ్‌సీలు 24 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీలు సులభమైన నిబంధనలపై రుణాలు అందిస్తున్నాయి. చాలా కంపెనీలు మీ ఇంటి వద్దే బంగారు రుణాన్ని అందిస్తాయి. ఎన్‌బీఎఫ్‌సీలతో పోలిస్తే, బ్యాంకుల బంగారు రుణాల ప్రక్రియ చాలా కఠినమైదని వివరించారు.
బంగారు రుణం ఒకటి నుండి మూడు సంవత్సరాల స్వల్ప కాలానికి మంజూరు చేయబడుతుంది. మీ క్రెడిట్ స్కోర్ పట్టింపు ఉండదు. మీ వద్ద బంగారాన్ని ఉండాలి. అందుకే దేశంలో బంగారు రుణాల పరిధి వేగంగా పెరుగుతోంది. 2020 అక్టోబర్‌లో 52,843 కోట్ల రూపాయల విలువైన బంగారు రుణాలు మంజూరయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ డేటా చెబుతోంది. అక్టోబర్ 2021లో ఈ సంఖ్య 37 శాతం వృద్ధితో 72,420 కోట్ల రూపాయలకు చేరుకుంది. అక్టోబర్ 2022లో 83,620 కోట్ల రూపాయల విలువైన బంగారు రుణం మంజూరు అయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 15.5 శాతం ఎక్కువ.
ఒక విషయం ఏంటంటే మీకు కూడా బంగారు రుణం కావాలంటే దాని వడ్డీని ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. సకాలంలో వడ్డీ చెల్లించనందుకు ఆర్థిక సంస్థలు జరిమానాలు విధిస్తాయి. పెనాల్టీ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు నిర్ణీత వ్యవధిలో వడ్డీని చెల్లించకుంటే, రుణదాతలు మీ బంగారాన్ని వేలం వేయవచ్చు. అయితే దీనికి ముందు, ఆర్థిక సంస్థలు నోటీసులు, హెచ్చరికలు జారీ చేస్తాయి. అందుకే బంగారు రుణంపై వడ్డీని సకాలంలో చెల్లిస్తూ ఉండండి. డబ్బులు సమకూర్చుకుని అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించి, మీ బంగారాన్ని తిరిగి తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి