AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nominee: బ్యాంకు అకౌంట్‌, ఇతర పొదుపు పథకాలకు నామినీలు ఎంత మంది ఉండవచ్చు..!

సాధారణంగా చాలా మందికి బ్యాంకు అకౌంట్‌, ఇతర పొదుపు పథకాలు ఉంటాయి. అకౌంట్‌ తీసే సమయంలో ఫారంలో నామినీ పేరును తప్పనిసరి నమోదు చేయాల్సి ఉంటుంది. వివిధ పథకాలు..

Nominee: బ్యాంకు అకౌంట్‌, ఇతర పొదుపు పథకాలకు నామినీలు ఎంత మంది ఉండవచ్చు..!
Nominee
Subhash Goud
|

Updated on: Nov 03, 2022 | 5:35 AM

Share

సాధారణంగా చాలా మందికి బ్యాంకు అకౌంట్‌, ఇతర పొదుపు పథకాలు ఉంటాయి. అకౌంట్‌ తీసే సమయంలో ఫారంలో నామినీ పేరును తప్పనిసరి నమోదు చేయాల్సి ఉంటుంది. వివిధ పథకాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ పథకాలు,హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ఈపీఎఫ్‌తో తదితర ఖాతాలకు నామినీ పేరు చేర్చడం తప్పనిసరి. ఎందుకంటే ఏదైనా కారణంగా ఖాతాదారుడు చనిపోతే ఖాతాకు సంబంధించిన డబ్బులను నామినీకి అందజేస్తారు. అందుకే నామినీ పేరును చేర్చడం తప్పనిసరైంది. ఈ మధ్య కాలంలో నామినీ పేరు లేనిది బ్యాంకు అకౌంట్‌ తీయడం,పథకాలలో చేరడం కుదరదు. పెట్టుబడిదారులకు, పీఎఫ్‌, ఇతర ఇన్సురెన్స్‌దారులకు ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో మీకు వచ్చే మొత్తం నామినీకి చెందుతుంది. నామినీ పేరు లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. గతంలో నామినీ గురించి పెట్టిగా పట్టించుకోకపోయినా.. ప్రస్తుతం నిబంధనలు మారడంతో నామినీ పేరు చేర్చడం తప్పనిసరైంది.

ఖాతాదారుడు మరణించిన మరణించిన సమయంలో..

పెట్టుబడులు, ఈపీఎఫ్‌, ఇన్సురెన్స్ విషయాలలో ఖాతాదారుడు మరణించిన సందర్భంలో డబ్బులను అందించేందుకు అతని వారసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా నామినీ తోడ్పడతారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, డీమ్యాట్‌ ఖాతా, చిన్న మొత్తాల పొదుపు, బ్యాంకు ఖాతాలు, జీవిత బీమా పాలసీలు.. ఇలా ప్రతి చోటా నామినీ పేరు తప్పనిసరి. ఒకవేళ ఒక ఖాతాదారుడు నామినీ పేరు రాయలేదనుకుందాం.. ఆ ఖాతాదారుడికి ఏదైనా జరిగినప్పుడు బ్యాంకు సంబంధిత వ్యక్తి వారసుల కోసం చూస్తుంది. వారు వచ్చిన తర్వాత వారసత్వ ధ్రువీకరణను కోరుతుంది. లేదా వీలునామా అవసరమని చెప్పవచ్చు. ఇవన్నీ పూర్తయ్యేనాటికి ఎంతో సమయం పడుతుంది. రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. బ్యాంకు ఖాతాల్లో ఎవరూ పట్టించుకోని సొమ్ము వేల కోట్లల్లో ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. నామినీ పేరును మార్చుకోవచ్చు. ఒక వ్యక్తి వీలునామా రాసినప్పుడు.. నామినీ.. ఆ మేరకు వారసులకు ఆస్తులను అందించాల్సి ఉంటుంది. అంతేకానీ, నామినీగా పేరు రాసినంత మాత్రాన మొత్తం అతనికి/ఆమెకే చెందదు. నామినీ పేరును ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.

నామినీలు ఎంత మంది ఉండవచ్చు..

బ్యాంకు ఖాతాలో ఒకరిని నామినీగా పేర్కొనవచ్చు. అలాగే ఉమ్మడి ఖాతా ఉంటే.. ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. జీవిత బీమా పాలసీల్లో ఎంతమంది నామినీలనైనా చేర్చే అవకాశం ఉంటుంది. పాలసీ విలువలో ఎవరికి ఎంత శాతం చెందాలన్నది వివరించాలి. ఈపీఎఫ్‌లోనూ ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. డీమ్యాట్‌ ఖాతాలోనూ ఒకరికంటే ఎక్కువ నామినీలుగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇలా నామినీ పేరు చేర్చితే ఖాతాదారుని ప్రయోజనాలు నామినీకి అందుతాయి. అందుకే అధికారులు పదేపదే నామినీ పేరు చేర్చాలని కోరుతుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి