
Bank Account Nominee: మీరు బ్యాంకులో ఖాతా తెరవడానికి వెళ్ళినప్పుడల్లా, నామినీని జోడించమని అడుగుతారు. అది పొదుపు ఖాతా అయినా, ఉమ్మడి ఖాతా అయినా, కరెంట్ ఖాతా అయినా లేదా డీమ్యాట్ ఖాతా అయినా, నామినీని జోడించడం అవసరం. దీని కోసం నామినీగా చేయాలనుకునే వ్యక్తి పేరు, వయస్సు, ఖాతాదారుడితో సంబంధం, చిరునామాను ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఏదైనా పరిస్థితిలో ఖాతాదారుడు మరణించినట్లయితే, ఖాతాలో జమ చేసిన డబ్బును నామినీకి బదిలీ చేయవచ్చు. అయితే గతంలో నామినీ లేకుండా బ్యాంకు అకౌంట్లు ఉండేవి. కానీ ఇప్పుడు నామినీ లేని ఖాతాలకు తప్పకుండా వారిని చేర్చడం తప్పనిసరి అయిపోయింది.
ఖాతాదారుడు కోరుకుంటే ఒకటి కంటే ఎక్కువ నామినీలను చేయవచ్చు. ఈ పరిస్థితిలో డబ్బు అందరికీ సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఇది మాత్రమే కాదు, బ్యాంకులో ఏ నామినీకి ఎంత వాటా ఇవ్వాలో మీరు పేర్కొనవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఎవరిని నామినీగా చేయవచ్చు? ఖాతాదారుడు వివాహితుడైతే, చట్టబద్ధమైన వారసులు అతని భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఖాతాదారుడు వివాహం చేసుకోకపోతే, అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు డిపాజిట్ చేసిన మొత్తాన్ని వారసులుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ దీని కోసం కొన్ని వివరాలు ఫామ్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతాకు ఎవరినీ నామినీ చేయనట్లయితే, అతని మరణం తర్వాత, అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు అతని చట్టబద్ధమైన వారసునికి అందుతుంది. వివాహిత వ్యక్తి చట్టపరమైన వారసులు అతని భార్య, పిల్లలు తల్లిదండ్రులు. మరణించిన ఖాతాదారు అవివాహితుడు అయితే, అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు అతని చట్టపరమైన వారసుడిగా క్లెయిమ్ చేయవచ్చు. ఒకవేళ నామినీ చేయని పక్షంలో, చాలా రకాల డాక్యుమెంట్స్ అందించాల్సి ఉంటుంది.
అయితే నామినీ పేరు లేకపోతే ఇన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అదే అకౌంట్‌కు నామినీ పేరు చేర్చినట్లయితే ఇన్ని పత్రాలు అందించాల్సిన అవసరం ఉండదు. కేలలం ఆధార్, ఇతర వివరాలు ఇందిస్తే సరిపోతుంది. సో.. ప్రతి ఒక్కరు అకౌంట్‌కు నామినీని జోడించడం తప్పనిసరి. అందుకే బ్యాంకులు పదేపదే నామినీలను జోడించని వారికి నామినీలను యాడ్ చేసుకోవాలని చెబుతూ వస్తోంది.