PAN Card: మీ పాన్‌కార్డులో తప్పులున్నాయా..? సరిదిద్దుకోవడం ఎలా..? ఆన్‌లైన్‌లో ఇలా చేయండి

|

Jan 08, 2023 | 1:39 PM

పాన్‌ కార్డు.. ప్రస్తుతం అందరికి అవసరమే. బ్యాంకు ఖాతా తీయడం నుంచి ఇతర ఆర్థికపరమైన లావాదేవీలు ఎంతో అవసరం. పాన్‌కార్డు అనేది ఆర్థిక లావాదేవీల చరిత్రను తెలిజేస్తుంది..

PAN Card: మీ పాన్‌కార్డులో తప్పులున్నాయా..? సరిదిద్దుకోవడం ఎలా..? ఆన్‌లైన్‌లో ఇలా చేయండి
Pan Card
Follow us on

పాన్‌ కార్డు.. ప్రస్తుతం అందరికి అవసరమే. బ్యాంకు ఖాతా తీయడం నుంచి ఇతర ఆర్థికపరమైన లావాదేవీలు ఎంతో అవసరం. పాన్‌కార్డు అనేది ఆర్థిక లావాదేవీల చరిత్రను తెలిజేస్తుంది. ఈ పాన్‌కార్డును ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ జారీ చేస్తుంది. పాన్‌కార్డులో వినియోగదారును అడ్రస్‌, పుట్టిన తేదీ తదితర వివరాలు ఉంటాయి. పాన్‌ నెంబర్‌ను నమోదు చేస్తే ఆర్థిక లావాదేవీల వివరాలు తెలుస్తాయి. అయితే ఒక్కోసారి పేరుతో, అడ్రస్‌లో తప్పు పడుతుటుంది. దీనిని సరి చేసుకోవడం చాలా మంది ఇబ్బందులు పడుతుంటాయి. టెక్నాలజీ పెరిగిపోవడంతో తప్పులను సరి చేసుకునే వెసులుబాటు ఉంది. త‌మ పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాల‌ని భావించినా ఆన్‌లైన్‌లోనే త‌మ మొబైల్ ఫోన్‌లోనైనా, డెస్క్‌టాప్ కంప్యూట‌ర్లలోనైనా ఆన్‌లైన్‌లో మార్చేసుకోవ‌చ్చు.

ఆన్‌లైన్‌లో ఎలా మార్చుకోవాలి..?

మొబైల్ ఫోన్ లేదా డెస్క్ టాప్ కంప్యూట‌ర్‌లో టీఐఎన్ ఎన్ఎస్‌డీఎల్ (www.tin-nsdl.com ) అని టైప్ చేస్తే పాన్ కార్డుకు సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో స‌ర్వీస్ విభాగంలోకి వెళ్లి పాన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కింద‌కు స్క్రోల్ చేస్తే Change / Correction in PAN Data అనే సెక్షన్ వస్తుంది. అందులోకి వెళ్లి క్లిక్‌ చేయాలి. అందులో అప్లికేష‌న్ టైప్ అనే ఆప్షన్ వ‌స్తుంది. అందులో Change / Correction in existing PAN Data ఆప్షన్‌ ఎంచుకోవాలి.

అక్కడ పాన్‌ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ, ఈ-మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత సబ్మిట్‌ చేయాలి. తర్వాత ఓ టోకెన్‌ నంబర్‌ వస్తుంది. అటుపై కింద బటన్‌ నొక్కి కొనసాగించాలి. ఇప్పుడు పాన్‌కార్డు క‌రెక్షన్ పేజీ క‌నిపిస్తుంది. అక్కడ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబ‌ర్‌, ఇంటి పేరు త‌దిత‌ర వివ‌రాల‌న్నీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పాన్ కార్డ్ ఇలా అప్‌డేట్‌

పాన్‌కార్డులోని వివరాలన్ని నమోదు చేసిన తర్వాత సబ్మిట్‌ కొట్టి తర్వాత పేమెంట్‌ మోడ్‌కు వెళ్లాలి. ఇలా మార్పులు చేసేందుకు కొంత రుసుము చెల్లించాక మీ పాన్‌కార్డు అప్‌డేట్‌ చేసినట్లు స్లిప్‌ వస్తుంది. ఆ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ స్లిప్‌ ప్రింట్‌ తీసుకుని దానిపై రెండు ఫొటోలు అతికించి, సంబంధిత ఎన్ఎస్‌డీఎల్ కార్యాల‌యానికి పంపించేస్తే.. అక్కడి నుంచి పాన్‌డేట్‌ అయి కొత్త పాన్‌కార్డు మీ అడ్రస్‌కు వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి