Housing Loans: ఆర్‌బీఐ రెపో రేట్ వడ్డన.. పెరిగిన హోం లోన్లను తగ్గించుకోండిలా..!

|

Feb 14, 2023 | 3:15 PM

గతేడాది మే లో నాలుగు శాతం ఉన్న రెపో రేట్ ప్రస్తుతం 2.5 శాతం పెరిగి 6.5 శాతానికి చేరింది. 6.5 శాతం వద్ద తీసుకున్న రుణం ప్రస్తుతం 9.00 శాతానికి చేరింది. పెరిగిన వడ్డీ రేట్లతో పోల్చుకుంటే 20 సంవత్సరాల కాల వ్యవధికి తీసుకున్న హోం లోన్ ప్రస్తుతం 30 సంవత్సరాలు మించి ఉండవచ్చు.

Housing Loans: ఆర్‌బీఐ రెపో రేట్ వడ్డన.. పెరిగిన హోం లోన్లను తగ్గించుకోండిలా..!
Home Loan Emi Calculator
Follow us on

సొంతిళ్లు..  చాలా మంది మధ్యతరగతి వారికి ఇదో తీరని కల. కొంత మంది తాము దాచుకున్న సేవింగ్స్‌కు తోడు కొంత హోం లోన్ తీసుకుని ఈఎంఐ పద్ధతిలో సొంతింటి కలను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేట్ పెంచిన ప్రతిసారి హౌసింగ్ ఈఎంఐ భారం పెరుగుతూ ఉంటుంది. ప్రతిసారి పెరుగుతున్న అదనపు ఈఎంఐ భారాన్ని ఎలా తగ్గించుకోవాలంటూ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నెలవారీ వాయిదాల పెరుగుదల రుణ గ్రహీతలకు ఆందోళన కలిగిస్తాయి. గతేడాది మే లో నాలుగు శాతం ఉన్న రెపో రేట్ ప్రస్తుతం 2.5 శాతం పెరిగి 6.5 శాతానికి చేరింది. 6.5 శాతం వద్ద తీసుకున్న రుణం ప్రస్తుతం 9.00 శాతానికి చేరింది. పెరిగిన వడ్డీ రేట్లతో పోల్చుకుంటే 20 సంవత్సరాల కాల వ్యవధికి తీసుకున్న హోం లోన్ ప్రస్తుతం 30 సంవత్సరాలు మించి ఉండవచ్చు. దీంతో ఈఎంఐల భారం కూడా అనుహ్యంగా పెరుగుతుంది. 

రుణ భారాన్నితగ్గించుకోండిలా

  • సాధారణంగా పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా ఈఎంఐ వాయిదా చెల్లింపు మొత్తాన్ని కూడా పెంచుకోవాలి. ప్రతి సంవత్సరం 5-10 శాతం పెంచుకోవడం ఉత్తమం. కొంతమంది రుణ దాతలు రూ.లక్ష వంటి పాక్షిక చెల్లింపులు చేయాలని కోరుతుంటారు. కాబట్టి అలా చెల్లింపు చేయడం కష్టం కాబట్టి ఈఎంఐ వాయిదాను పెంచుకోవాలి.
  • వాయిదాను పెంచడం భారంగా ఉందనుకునేవారు లోన్ ప్రిన్సిపల్ లో 5 శాతం చెల్లించడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం ద్వారా 20 సంవత్సరాల్లో తీరే రుణం 12 సంవత్సరాల్లోనే పూర్తవుతుంది. ఈఎంఐలో 5 శాతం పెంచుకునే బదులు అసలులో 5 శాతం చెల్లించడం ద్వారా వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది.
  • ఇతర రుణాలతో పోలిస్తే గృహ రుణం వడ్డీ తక్కువ. కాబట్టి దాన్ని తీర్చే విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పన్ను మినహాయింపు వంటి వాటితో పోలిస్తే నికర వడ్డీ 7 శాతం వరకూ ఉంటుంది. మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడి 10 శాతం వరకూ రాబడిని పొందవచ్చు. రెపో రేట్లు పెరిగినప్పుడు ముందస్తు చెల్లింపులు మీ లోన్‌పై ప్రారంభ వడ్డీని తగ్గించడంలో సాయం చేస్తాయి. 
  • రుణాన్ని ఎన్నిరోజుల్లో తిరిగి చెల్లిస్తున్నారో? అనే అంశంపై వడ్డీ ఆధారపడి ఉంటుంది. 20 సంవత్సరాల కాలానికి రుణం తీసుకుని 10 సంవత్సారాల్లోనే చెల్లిస్తే రేట్ల పెంపు కారణంగా కట్టాల్సిన వాయిదాలు 25 సంవత్సరాలకు చేరాయనుకుంటే ఈఎంఐను కనీసం పది శాతం పెంచుకుంటే మంచిది. ముందస్తు చెల్లింపుల ద్వాారా ఈఎంఐ భారం ఎక్కువ సంవత్సరాలు లేకుండా చూసుకోవాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం