Honda livo: జబర్దస్త్ లుక్‌లో మెరుస్తున్న హోండా లివో.. ధర, ఇతర ప్రత్యేకతలు ఇవే..!

భారతీయులు విశ్వసించే ద్విచక్ర వాహనాలలో హోండా మోడళ్లు ప్రముఖంగా ఉంటాయి. ఆ కంపెనీ విడుదల చేసిన అనేక వాహనాలను ప్రజలు ఎంతో ఆదరించారు. ఆధునిక కాలానికి అనుగుణంగా, లేటెస్ట్ టెక్నాలజీతో వివిధ వాహనాలను హోండా కంపెనీ తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో తన లివో బైక్ ను అప్ డేట్ చేసి విడుదల చేసింది. 2025 లివో బైక్ ప్రత్యేకతలు, ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం.

Honda livo: జబర్దస్త్ లుక్‌లో మెరుస్తున్న హోండా లివో.. ధర, ఇతర ప్రత్యేకతలు ఇవే..!
Honda Livo

Updated on: Jan 23, 2025 | 4:45 PM

హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) నుంచి విడుదలైన 2025 లివో మోటారు బైక్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిలో 109.51 సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, 4 స్పీడ్ గేర్ బాక్స్ ఏర్పాటు చేశారు. ఓబీడీ52బీ ప్రమాణాలు, స్లైలిష్ గ్రాఫిక్స్ ,డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, పర్యావరణ అనుకూల ఫీచర్లు అదనపు ప్రత్యేకతలుగా ఉన్నాయి.  లివో బైక్ లోని 109.51 సీసీ ఇంజిన్ నుంచి 6.47 కేడబ్ల్యూ శక్తి, 9.30 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. డ్రమ్, డిస్క్ అనే రెండు రకాల వేరియంట్లలో కొత్త బైక్ ను ఆకట్టకుంటోంది. డ్రమ్ వేరియంట్ ధర రూ.83,080, డిస్క్ వేరియంట్ ధర రూ.85,878 గా నిర్ధారించారు. మూడు రకాల రంగులలో బైక్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

కొత్త బైక్ లో పూర్తి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఇది రియల్ టైమ్ మైలేజీ, దూరం, సర్వీస్ డ్యూ హెచ్చరికలు, గేర్ పొజిషన్ తదితర వాటిని స్పష్టంగా చూపుతుంది. ఇక సైడ్ స్టాండ్, ఇంజిన్ కట్ ఆఫ్, మెరుగైన భద్రత, పర్యావరణ అనుకూల ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సుత్సుము ఒటానీ మాట్లాడుతూ ఆధునాతన ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త లివోను విడుదల చేశామన్నారు. కమ్యూటర్ మోటారు సైకిల్ విభాగంలో కొత్త ప్రమాణాలను తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్లైలిష్ లుక్ తో కొత్త లివో ఆకట్టుకుంటోందని, 110 సీసీ ఇంజిన్ బైక్ ల కేటగిరీలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తుందన్నారు. దేశంలోని అనేక మంది ప్రజల అవసరాలను లివో తీర్చగలదని ఆశిస్తున్నట్టు తెలిపారు.

హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటిండ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ కూాడా కొత్త లివో మోటారు సైకిల్ ప్రత్యేకతలపై మాట్లాడారు. మార్కెట్ లో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తున్నామన్నారు. హోండా లివో 2025 మోడల్ కు ఆదరణ లభిస్తుందన్నారు. ఓబీడీ2బీ సాంకేతికత, నిబంధనలకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మార్కెట్ లో తన జోరు కొనసాగిస్తోంది. ఎన్నో ఏళ్లుగా వివిధ రకాల మోడళ్లతో భారతీయులను ఆకట్టుకుంటున్న ఈ కంపెనీ.. మరో కొత్త మోడల్ తో ముందుకు వచ్చింది. ఈ కంపెనీ విడుదల చేసిన లివో గతంలోనే కస్టమర్ల ఆదరణ పొందింది. దాన్ని అధునాతన ఫీచర్లు జోడించి 2025 లివో గా మార్కెట్ లోకి విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి