Honda Cars: కస్టమర్లకు హోండా కంపెనీ బంపర్‌ ఆఫర్‌.. కార్లపై రూ.72,145 వరకు తగ్గింపు

|

Dec 03, 2022 | 7:38 PM

ఆటో రంగ దిగ్గజం హోండా తన కార్లపై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. డిసెంబర్ నెలలో కొన్ని హోండా కార్లపై రూ.72,340 వరకు ప్రయోజనాలను పొందవచ్చు..

Honda Cars: కస్టమర్లకు హోండా కంపెనీ బంపర్‌ ఆఫర్‌.. కార్లపై రూ.72,145 వరకు తగ్గింపు
Honda Car
Follow us on

ఆటో రంగ దిగ్గజం హోండా తన కార్లపై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. డిసెంబర్ నెలలో కొన్ని హోండా కార్లపై రూ.72,340 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కార్లలో హోండా అమేజ్, జాజ్, WR-V, హోండా సిటీ ఉన్నాయి. ఈ మోడళ్లపై కొనుగోలుదారులు నగదు తగ్గింపులు, లాయల్టీ బోనస్‌లు, ఎక్స్ఛేంజ్ తగ్గింపులు, కార్పొరేట్ తగ్గింపులు వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

హోండా సిటీపై ఆఫర్లు:

హోండా సిటీ 5 జనరేషన్‌ అన్ని పెట్రోల్ మోడళ్లపై మొత్తం రూ.72,145 తగ్గింపును పొందవచ్చు. ఈ కారుపై కస్టమర్లు రూ.30,000 నగదు తగ్గింపు లేదా రూ.32,145 విలువైన యాక్ససరీలను పొందవచ్చు. ఇది కాకుండా, కస్టమర్లు రూ.20,000 కార్ ఎక్స్ఛేంజ్ తగ్గింపు, రూ.7,000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.5,000 వరకు లాయల్టీ బోనస్, రూ. 8,000 కార్పొరేట్ తగ్గింపును పొందవచ్చు.

హోండా WR-Vపై ఆఫర్‌లు:

ఈ హోండా కారుపై రూ.30,000 వరకు నగదు తగ్గింపు, రూ. 35,340 విలువైన ఉచిత యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా కస్టమర్లు రూ.20,000 ఎక్స్ఛేంజ్ తగ్గింపు, రూ. 7,000 వరకు కార్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. ఆటో కంపెనీ ఈ వాహనంపై లాయల్టీ బోనస్, రూ.5,000 వరకు కార్పొరేట్ తగ్గింపును కూడా అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

హోండా అమేజ్‌పై ఆఫర్లు:

హోండా అమేజ్‌పై మొత్తం రూ.43,144 తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.10,000 నగదు తగ్గింపు లేదా రూ.12,144 విలువైన ఉచిత ఉపకరణాలు కూడా తగ్గింపులో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు ఈ కారుపై రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 లాయల్టీ బోనస్, మొత్తం రూ. 6,000 తగ్గింపును కూడా పొందవచ్చు.

ఇది కాకుండా, రాబోయే ఐదు నెలల్లో హోండా తన మూడు ప్రసిద్ధ డీజిల్ మోడళ్లను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, జపాన్ కంపెనీ హోండా సిటీ, అమేజ్, WR-V డీజిల్ వేరియంట్‌ల ఉత్పత్తిని నిలిపివేస్తుంది. దీనికి అతిపెద్ద కారణం ఏంటంటే 1 ఏప్రిల్ 2023 నుండి అమలు చేయనున్న రియల్ టైమ్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) నిబంధనలు. ఈ మూడు కార్ల డీజిల్ వేరియంట్‌లు ఆర్డీఈ నిబంధనలను అందుకోలేవట. నిబంధనలకు అనుగుణంగా కంపెనీ తన ఇంజిన్‌లో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది.

డీజిల్ ఇంజన్లు ఉన్న కార్లు ఇప్పటికే పెట్రోల్ ఇంజన్లు కలిగిన కార్ల కంటే ఖరీదైనవి. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ ఇంజన్‌ను ఆర్‌డీఈ నిబంధనలకు అనుగుణంగా చాలా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో కార్ల కంపెనీ ధర గణనీయంగా పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..