కరోనా మహమ్మారి కారణంగా గృహ, స్థిరాస్తి కొనుగోళ్లు కొంత వెనుకబడ్డాయి. కోవిడ్ ఎఫెక్ట్ తగ్గడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. భారతదేశంలోని 7 ప్రధాన నగరాల్లో రూ.1.56 లక్షల కోట్ల విలువైన గృహాలు అమ్ముడయ్యాయని నివేదికలు వెలువడుతున్నాయి. అధిక వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ఖర్చులు ఉన్నప్పటికీ ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పూణె, హైదరాబాద్ వంటి టాప్ ఏడు భారతీయ నగరాలు మొదటి అర్ధ సంవత్సరంలో 119 శాతం వృద్ధితో రూ.1,55,833 కోట్ల విలువైన గృహాలను విక్రయించినట్లు FY23 ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఒక నివేదికలో తెలిపింది. ఇదే FY22 కాలంలో ఇదే కాలంలో విక్రయించిన యూనిట్ల మొత్తం విలువ దాదాపు రూ.71,295 కోట్లు ఉన్నట్లు పేర్కొంది.
వెలువడిన నివేదికల ప్రకారం.. ఏప్రిల్, సెప్టెంబరు 2022 మధ్య అగ్ర నగరాల్లో దాదాపు 1,73,155 గృహాలు అమ్ముడయ్యాయి. అదే ఏడాది క్రితం ఇదే కాలంలో 87,375 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సందర్భంగా అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి మాట్లాడుతూ.. విలువ పరంగా, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్) H1 FY23లో రూ. 74,835 కోట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది. రూ. 24,374 కోట్లతో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) తర్వాతి స్థానంలో ఉంది. ఇక మొత్తం గృహాల విక్రయాలలో 110% వార్షిక లాభం రూ. 35,610 కోట్లుతో 174% సాధించింది.
2022 మొదటి వార్షికంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ మొత్తం గృహాల విక్రయాలు రూ. 8,896 కోట్లకు చేరుకున్నాయని పూరీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్)లో సుమారు 52,185 గృహాలు విక్రయించబడ్డాయి. అదే సమయంలో ఎన్‌సీఆర్‌లో సుమారు 30,300 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఎంఎంఆర్ గృహాల విక్రయాలలో వాల్యూమ్, విలువ పరంగా రెండింటిలోనూ ఆధిపత్యం చెలాయించింది. ఆ తర్వాత ఎన్‌సీఆర్, పూణే ఉన్నాయి.
హైదరాబాద్ మొత్తం గృహాల అమ్మకాల విలువలో 130 శాతం ఎగబాకింది. 2022-23లో రూ.6,926 కోట్ల నుండి రూ.15,958 కోట్లకు పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని ప్రథమార్థంలో హైదరాబాద్‌లో దాదాపు 22,840 గృహాలు విక్రయించబడ్డాయి.
బెంగళూరులో 2022-23 మొదటి ఆర్థిక సంవత్సరంలో రూ. 17,651 కోట్ల విలువైన గృహాలు అమ్ముడయ్యాయి, అలాగే రెండు త్రైమాసికాలలో రూ. 8,218 కోట్లకు-ఏటా 115 శాతం పెరుగుదల ఉంది. మొదటి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,532 కోట్ల విలువైన దాదాపు 26,580 ఇళ్లను పూణే విక్రయించిందని నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాలలో కోల్‌కతా, చెన్నైలో వరుసగా రూ.4,774 కోట్లు, రూ.4,709 కోట్ల విలువైన గృహ విక్రయాలు వార్షికంగా 115 శాతం, 57 శాతం పెరిగాయి.
అయితే చాలా మంది తక్కువ ధరలో వస్తున్నాయని, సరైన సమాచారం తెలుసుకోకుండా.. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో భూముల ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం ద్వారా నష్టపోతుంటారు. ఇలాంటి వారి కోసం హైదరాబాద్‌లో ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో జరగనుంది. ఈనెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహించే TV9 స్వీట్ హోమ్ అండ్ ఇంటీరియర్ ఎక్స్‌పోను సందర్శించండి. అత్యంత విశ్వసనీయమైన దిగ్గజ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి