Home Insurance: దొంగతనం జరిగినప్పుడు గృహ బీమా ఉపయోగపడుతుందా? దీని ప్రయోజనాలు ఏమిటి?

ఈ రోజుల్లో బీమా రంగానికి మంచి ఆదరణ ఉంది. పెరుగుతున్న అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు ఇలా రకరకాల అంశాలలో ఆరోగ్య బీమాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో..

Home Insurance: దొంగతనం జరిగినప్పుడు గృహ బీమా ఉపయోగపడుతుందా? దీని ప్రయోజనాలు ఏమిటి?
Home Insurance

Updated on: Dec 15, 2022 | 5:41 PM

ఈ రోజుల్లో బీమా రంగానికి మంచి ఆదరణ ఉంది. పెరుగుతున్న అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు ఇలా రకరకాల అంశాలలో ఆరోగ్య బీమాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు ఉండాలనేది కల. అటువంటి పరిస్థితిలో ఇంటి రక్షణకు గృహ బీమా చాలా ముఖ్యమైనది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇంటికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి గృహ బీమా తీసుకుంటారు. దీని కింద ఇంటిని సురక్షితంగా ఉంచడమే కాకుండా అనేక ఇతర అంశాలు కూడా కవర్ అవుతాయి. భూకంపాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇల్లు దెబ్బతింటుంది. ఈ సందర్భంలో ఈ బీమా నష్టాన్ని తిరిగి పొందుతారు. ఈ సౌకర్యాల కోసం మీరు గృహ బీమాను కూడా పొందవచ్చు. మీ ఇంటికి నష్టం జరిగితే ఆ నష్టాన్ని బీమా రూపంలో తిరిగి పొందవచ్చు. దీనితో పాటు దొంగతనం, ఇతర చిన్న వస్తువుల నష్టంపై కూడా బీమా కింద రికవరీ చేయవచ్చు. గృహ బీమా ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

జీవిత బీమా పాలసీదారు మరణిస్తే వారి కుటుంబానికి బీమా మొత్తాన్ని చెల్లిస్తున్నట్లే గృహ బీమా కూడా ఇంటికి జరిగే నష్టాన్ని కవర్ చేస్తుంది. ఒక మంచి గృహ బీమా ప్రకృతి వైపరీత్యాల నుండి ఇతర రకాల నష్టాలను కవర్ చేస్తుంది. అగ్నిమాపక బీమా, ప్రకృతి వైపరీత్యాల నష్టానికి బీమా, కౌలుదారు బీమా, భూస్వామి బీమా, సమగ్ర బీమా, గృహోపకరణాల రక్షణ కోసం బీమా, మరమ్మతులు లేదా పునర్నిర్మాణం కోసం బీమా అందుబాటులో ఉన్నాయి.

గృహ బీమా ప్రయోజనాలు:

అటువంటి బీమాపై బీమా కంపెనీ ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ రకమైన బీమాను ఎవరైనా తీసుకోవచ్చు. దీని ప్రయోజనాన్ని పొందడానికి, సాధారణ ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. హోమ్ ఇన్సూరెన్స్ మీ ఇంటికి మాత్రమే కాకుండా గ్యారేజ్, హాల్, ప్రాంగణాలు మొదలైన వాటికి కూడా వర్తిస్తుంది. దీనితో పాటు, ఫర్నిచర్, ఇతర ఉత్పత్తులను కూడా యాడ్ ఆన్ సౌకర్యం కింద కవర్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

నష్టాన్ని ఎదుర్కొవాల్సిన అవసరం లేదు:

ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో మీ ఇల్లు భారీ నష్టానికి గురవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ బీమా మొత్తం ఇంటికి భద్రత కల్పించడానికి ఆర్థిక సహాయం రూపంలో భారీ మొత్తాన్ని ఇస్తుంది. దీని వల్ల మీరు పెద్దగా నష్టపోవాల్సిన అవసరం ఉండదు. దొంగతనం, చోరీల వల్ల ఇంట్లో జరిగే నష్టాలు కవర్ చేయబడతాయి. కొన్ని బీమా పాలసీలు ఇంట్లో దొంగిలించబడిన వస్తువులను కూడా కవర్ చేస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి