Holi Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. హోలీ సందర్భంగా బ్యాంకులకు వరుస సెలవులు

|

Mar 06, 2023 | 1:46 PM

రోజువారీగా బ్యాంకు లావాదేవీలు జరిపేవారికి అలర్ట్‌. ఎందుకంటే నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయన్నది ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. బ్యాంకు..

Holi Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. హోలీ సందర్భంగా బ్యాంకులకు వరుస సెలవులు
Bank Closed
Follow us on

రోజువారీగా బ్యాంకు లావాదేవీలు జరిపేవారికి అలర్ట్‌. ఎందుకంటే నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయన్నది ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. బ్యాంకు సెలవులను తెలుసుకోకపోతే సమయం వృధా కావడమే కాకుండా కొంత ఆర్థిక నష్టం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ప్రతి నెల, పండగల సమయాల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. వాటిని గమనించి బ్యాంకు పనులను ప్లాన్‌ చేసుకోవడం మంచిది. ఇప్పుడు హోలీ పండగ రాబోతోంది. పండగ సందర్భంగా బ్యాంకులు మూత పడనున్నాయి. హోలీ పండగకు రెండు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవులను బ్యాంకు ఖాతాదారులు గమనించడం చాలా ముఖ్యం.

అయితే హోలీ పండగ దృష్ట్యా కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు వరుసగా రెండు రోజుల పాటు సెలవులు ఉంటాయి. ఈ సెలవుల జాబితాను ఆర్బీఐ తన ఆధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ప్రతి నెల మొదటి, మూడవ శనివారాలు బ్యాంకుల తెరిచి ఉంటాయి. రెండవ, నాల్గవ శనివారాలలో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఈ వారంలో బ్యాంకుల సెలవుల జాబితా:

మార్చి 7న అంటే మంగళవారం హోలీ పండగ సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఈ సెలవు మహారాష్ట్ర, అసోం, రాజస్థాన్‌, శ్రీనగర్‌, గోవా, ఉత్తరాఖండ్‌, జమ్మూకశ్మీర్‌, తెలంగాణ, జార్ఖండ్‌ రాష్ట్రాలలో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మార్చి 8వ తేదీన బుధవారం హోలీ రెండో రోజు కూడా బ్యాంకులకు సెలవు ఉంది. ఆంధ్రప్రదేశ్, త్రిపుర, గుజరాత్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, చండీగఢ్‌, ఉత్తరాఖండ, సిక్కిం, రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌, బెంగాల్‌, న్యూఢిల్లీ, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మేఘాలయ, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలలో బ్యాంకులు మూసి ఉంటాయి.

మార్చి 9న గురువారం హోలీ సందర్భంగా బీహార్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
మార్చి 11న రెండో శనివారం బ్యాంకులకు సెలవు.

ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లకు హోలీ పండుగ సందర్భంగా మార్చి 7, 8 తేదీలలో వరుసగా బ్యాంక్ సెలవులు ఉంటాయి. బీహార్‌లో మార్చి 8, 9 తేదీల్లో వరుసగా రెండు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే హోలీ కాకుండా ఇతర రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

మార్చి 22: ఉగాది పండగ సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మణిపూర్, జమ్మూ, గోవా, బీహార్‌, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి..

మార్చి 30: శ్రీరామ నవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ మరియు సిమ్లాలలో బ్యాంకులు మూసివేయబడతాయి.

తరువాతి రోజు కూడా బ్యాంకులు మూసిఉన్నప్పటికీ ఏటీఎంలు, నగదు డిపాజిట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు పని చేస్తూనే ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి