Honda Grazia 125: మార్కెట్లోకి రకరకాల ద్విచక్ర వాహనాలు విడుదలవుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కొత్త బైక్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి ఆయా వాహన కంపెనీలు. ఇక తాజాగా హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మరో కొత్త స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రాజియా 125 స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ధర రూ. రూ.87,138 (ఎక్స్ షోరూమ్, గురుగ్రామ్)గా నిర్ణయించింది. దేశంలోని రేసింగ్ ఔత్సాహికుల కోసం ఈ కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చినట్లు హెచ్‌ఎంఎస్‌ఐ ఎండీ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ప్రోగ్రామ్డ్ ప్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్:
కాగా, ఈ స్కూటర్‌కు ఎన్నో ఫీచర్స్‌ను అందించింది.125సీసీ ఇంజిన్‌తో వస్తున్న ఈ వాహనం ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్‌తో రూపొందించింది కంపెనీ.ఎల్‌ఈడీ డీసీ హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ పాసింగ్ స్విచ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఒకవేళ స్టాండ్ తీయకపోతే ఇంజిన్ స్టార్ట్ కాని విధంగా టెక్నాలజీని వినియోగించారు ఈ స్కూటర్‌లో. అలాగే ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌తో పాటు, వెనుకవైపు ట్రిపుల్ స్టెప్ అడ్జెస్టబుల్ సస్పెన్షన్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ముందువైపు డిస్క్‌బ్రేక్, వెనుకవైపు డ్రమ్ బ్రేకింగ్ టెక్నాలజీని కూడా ఉంది. ఈ విధంగా అత్యాధునిక ఫీచర్లతో ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది కంపెనీ.
ఇవి కూడా చదవండి: