Nokia: నోకియా సంచలన నిర్ణయం.. ఆ స్మార్ట్‌ఫోన్‌లకు స్వస్తి..!

|

Mar 11, 2022 | 9:36 PM

Nokia Flagships: మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతుండగా, ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం నోకియా (Nokia) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు స్వస్తి..

Nokia: నోకియా సంచలన నిర్ణయం.. ఆ స్మార్ట్‌ఫోన్‌లకు స్వస్తి..!
Follow us on

Nokia Flagships: మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతుండగా, ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం నోకియా (Nokia) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు స్వస్తి పలికేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్స్‌ (Smartphone)ను నోకియా విడుదల చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. నోకియా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ను ఆలస్యంగా మార్కెట్లోకి తీసుకువచ్చినా.. తొందరలోనే ముగింపు పలికేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఉత్పత్తి నిలిపివేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వీటికి బదులుగా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్కువ దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఇటీవల బార్సిలోనాలో ముగిసిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2022లో బడ్జెట్‌ రేంజ్‌ నోకియా-సి సిరీస్‌ మొబైల్స్‌ను ప్రకటించింది.

ఈ సందర్భంగా హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ హెడ్‌ ఆడమ్‌ ఫెర్గూసన్‌ మాట్లాడుతూ.. 800 డాలర్లకు పైచిలుకు స్మార్ట్‌ఫోన్స్‌ తయారు చేయడం కష్టంతో కూడుకుందని వ్యాఖ్యానించారు. వీటి సేల్స్‌ కూడా ఆశించిన మేర లేవని అభిప్రాయపడ్డారు. ఎంట్రీ లెవల్‌, మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌లపై కంపెనీ ఎక్కువగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. బడ్జెట్‌ రేంజ్‌లో ఫోన్‌లను తయారు చేస్తూ 5G సెగ్మెంట్‌లో గ్లోబల్‌ లీడర్‌గా ఎదిగేందుకు సంస్థ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

BMW SUV: బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త కారు.. ధర, ఫీచర్స్‌ వివరాలు

etrol Diesel Price: లీటర్‌ పెట్రోల్‌ @254.. ఎక్కడో తెలుసా..?