Hero Motocorp: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా హీరో నుంచి సరికొత్త బైక్.. ధర కూడా చాలా తక్కువే..

|

Dec 22, 2022 | 6:05 AM

భారత మార్కెట్‌లోకి హీరో మోటార్ కార్ప్ సరికొత్త బైక్‌ను విడుదల చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు పోటీ ఇచ్చేలా XPulse 200T 4V పేరుతో అద్దిరిపోయే బైక్‌ను తీసుకువచ్చింది. దీని ధర రూ. 1,25,726(ఎక్స్-షోరూమ్, ముంబై) నుంచి ప్రారంభం అవుతుంది.

Hero Motocorp: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా హీరో నుంచి సరికొత్త బైక్.. ధర కూడా చాలా తక్కువే..
Xpulse 200t 4v
Follow us on

భారత మార్కెట్‌లోకి హీరో మోటార్ కార్ప్ సరికొత్త బైక్‌ను విడుదల చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు పోటీ ఇచ్చేలా XPulse 200T 4V పేరుతో అద్దిరిపోయే బైక్‌ను తీసుకువచ్చింది. దీని ధర రూ. 1,25,726(ఎక్స్-షోరూమ్, ముంబై) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ హీరో బైక్‌ను ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ కోసం ఉపయోగించవచ్చు. హీరో కంపెనీకి చెందిన ఈ బైక్ మోడల్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌కు పోటీగా ఉంది. స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ ఫంక్ లైమ్ ఎల్లో, మ్యాట్ షీల్డ్ గోల్డ్ వంటి మూడు కొత్త కలర్ ఆప్షన్‌లలో కంపెనీ ఈ బైక్‌ను తీసుకువచ్చింది. కస్టమర్‌లు ఈ మోటార్‌సైకిల్‌ను వారి సమీప హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్ నుండి కొనుగోలు చేయవచ్చు.

ఇంజిన్, పనితీరు..

కొత్త XPulse 200T 4V 200cc 4 వాల్వ్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌. ఇది గరిష్టంగా 19.1PS పవర్, 17.3Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దాని పాత వెర్షన్ కంటే 6% ఎక్కువ శక్తిని, 5% అదనపు టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది ముందు 37 mm ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనో-షాక్‌ను కలిగి ఉంది. రైడర్ భద్రత కోసం ఇది 276mm ముందు, 220mm వెనుక పెటల్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.

లుక్, ఫీచర్లు..

ఇది నియో-రెట్రో స్టైలింగ్, బోల్డ్ గ్రాఫిక్స్‌తో వృత్తాకార పూర్తి-LED హెడ్‌ల్యాంప్‌లు, LED పొజిషన్ ల్యాంప్‌లను కలిగి ఉంది. ఇది రిలాక్స్డ్ సీటింగ్ పొజిషన్, ట్యూబ్-టైప్ రెట్రో పిలియన్ గ్రాబ్‌ని కలిగి ఉంది. Hero XPulse 200T 4V స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, USB ఛార్జర్, గేర్ ఇండికేటర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్‌తో పూర్తిగా డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..