Hero Glamour 2023: న్యూ లుక్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయిన హీరో గ్లామర్.. అత్యాధునిక ఫీచర్లు.. అతి తక్కువ ధరలోనే..
హీరో మోటార్ కార్ప్ ఈ గ్లామర్ ను మరోసారి రీ లాంచ్ చేసింది. కొన్ని ఫీచర్లను యాడ్ చేస్తూ.. అప్ గ్రేడెడ్ వెర్షన్ గా తీసుకొచ్చింది. డిస్క్, డ్రమ్ వేరియంట్లో మార్కెట్లో అందుబాటులో ఉంచింది. కేవలం రూ. 82,348 (ఎక్స్ షోరూం ఢిల్లీ) ప్రారంభ ధరతో విక్రయానికి ఉంచింది. హీరో కంపెనీ ఈ కొత్త గ్లామర్ ని పూర్తిగా డిజిటలైజ్ చేసింది. డిజిటల్ మీటర్, రియల్ టైం మైలేజ్ ఇండికేటర్, మొబైల్ చార్జింగ్ పోర్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లను జోడించింది.

హీరో కంపెనీ నుంచి వచ్చిన అనేక మోడళ్లలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ లలో స్ల్పెండర్ తర్వాత గ్లామర్ ఉంటుంది. ఈ బైక్ కి మార్కెట్లో ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. దానిని అందిపుచ్చుకునేందుకు హీరో మోటోకార్ప్ ఈ గ్లామర్ ను మరోసారి రీ లాంచ్ చేసింది. కొన్ని ఫీచర్లను యాడ్ చేస్తూ.. అప్ గ్రేడెడ్ వెర్షన్ గా తీసుకొచ్చింది. డిస్క్, డ్రమ్ వేరియంట్లో మార్కెట్లో అందుబాటులో ఉంచింది. కేవలం రూ. 82,348 (ఎక్స్ షోరూం ఢిల్లీ) ప్రారంభ ధరతో విక్రయానికి ఉంచింది. హీరో కంపెనీ ఈ కొత్త గ్లామర్ ని పూర్తిగా డిజిటలైజ్ చేసింది. డిజిటల్ మీటర్, రియల్ టైం మైలేజ్ ఇండికేటర్, మొబైల్ చార్జింగ్ పోర్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లను జోడించింది. ఈ హీరో గ్లామర్ 2023 బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
లుక్, డిజైన్ ఇలా..
కొత్త గ్లామర్ లుక్ స్టైలిష్ గా ఉంది. పాత మోడల్లోని కొన్ని ట్రెడిషనల్ అంశాలను అలాగే ఉంచారు. ఫ్రంట్ కౌల్, ఫ్యూయల్ ట్యాంక్ పాత మోడల్లోనే ఉంచింది. ఇది ఇప్పుడు క్యాండీ బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ-బ్లాక్, స్పోర్ట్స్ రెడ్-బ్లాక్ అనే కొత్త కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ రైడర్‌తో పాటు పిలియన్ సీట్ల ఎత్తును వరుసగా 8 మిమీ, 17 మిమీ తగ్గించింది. సీటు స్థలాన్ని పెంచడానికి ఇంధన ట్యాంక్ ఒక ఫ్లాటర్ రూపంలో ప్రదర్శించబడుతుంది. 2023 హీరో గ్లామర్ 170ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.
స్పెసిఫికేషన్ల ఇవి..
కొత్త మోటార్‌సైకిల్ ఓబీడీ2, ఈ20 కంప్లైంట్ 125సీసీ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 7,500 ఆర్పీఎం వద్ద 10.7 బీహెచ్ పీ, 6,000 ఆర్పీఎం వద్ద 10.6ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. హీరో ఐ3ఎస్ (ఇడిల్ స్టాప్ – స్టార్ట్ సిస్టమ్) సపోర్టు ఉంటుంది. ఈ హీరో గ్లామర్ ప్రతి లీటర్ పై 63 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
అత్యధిక మార్కెట్ వాటా అందుకోవడమే లక్ష్యం..
ఈ కొత్త బైక్ లాంచింగ్ సందర్బంగా హీరో మోటోకార్ప్ ఇండియా బీయూ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ తమ గ్లామర్ బైక్ దేశంలోని యువతలో కోరుకొనే స్టైల్, సౌలభ్యం, సౌకర్యాలను, సాంకేతికత అంశాలను కలిగి ఉందన్నారు. ఎల్లప్పుడూ వినియోగదారులకు విలక్షణమైన ఫీచర్లు, సాంకేతికంగా అధునాతన ఉత్పత్తులను అందించడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. మార్కెట్లో అత్యంత పోటీ ఉండే 125సీసీ విభాగంలో తమ బ్రాండ్ ఉనికిని ఈ కొత్త గ్లామర్ మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ బ్రాండ్ మార్కెట్ వాటాను మెరుగుపరచడంలో సహాయపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..