Hero Moto Corp: బైక్‌లు, స్కూటర్లపై డిస్కౌంట్, ఎక్సేంజ్‌ ఆఫర్లు ప్రకటించిన హీరో..! ఏ వాహనాలపై ఎంతో తెలుసుకోండి..

Hero Moto Corp: కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఆటోమొబైల్ కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్ కొంత పుంజుకోవడంతో మళ్లీ లాభాల కోసం

Hero Moto Corp: బైక్‌లు, స్కూటర్లపై డిస్కౌంట్, ఎక్సేంజ్‌ ఆఫర్లు ప్రకటించిన హీరో..! ఏ వాహనాలపై ఎంతో తెలుసుకోండి..
Hero Moto Corp

Updated on: Aug 30, 2021 | 7:31 PM

Hero Moto Corp: కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఆటోమొబైల్ కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్ కొంత పుంజుకోవడంతో మళ్లీ లాభాల కోసం ప్రయత్నిస్తున్నాయి. 2021 పండుగ సీజన్ ప్రారంభానికి ముందు కంపెనీలు మరోసారి ఆఫర్లతో సిద్దమయ్యాయి. టూ వీలర్ కంపెనీలలో పెద్దదైన మోటోకార్ప్ స్కూటర్లు, బైక్‌లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, లాయల్టీ బోనస్‌లను అందిస్తోంది. ఇంతకు ముందు కూడా కంపెనీ 10 సంవత్సరాలు పూర్తి చేసినప్పుడు కస్టమర్ల కోసం ఈ ఆఫర్లను తీసుకువచ్చింది. ఈ సమయంలో మీరు డిస్కౌంట్ పొందగల స్కూటర్లు, బైక్‌ల జాబితాను ఒక్కసారి తెలుసుకోండి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే.

ఈ బైక్‌లపై డిస్కౌంట్
డిస్కౌంట్ లభిస్తున్న జాబితాలో 100 సీసీ, 125 సీసీ, 160 సీసీ, 200 సీసీ వాహనాలు ఉన్నాయి. కంపెనీ ప్రకటన ప్రకారం ఇక్కడ మీరు అన్ని వాహనాలపై రూ.3000 లాయల్టీ బోనస్, రూ .3000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. జాబితాలో చేర్చబడిన వాహనాలలో స్ప్లెండర్ ఇస్మార్ట్ BS6, HF డీలక్స్, స్ప్లెండర్ + BS6, ప్యాషన్ ప్రో, స్ప్లెండర్ + సూపర్ స్ప్లెండర్, Xtreme 160R ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం మీరు మీ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

స్కూటర్లపై డిస్కౌంట్
స్కూటర్ల మీద కూడా కంపెనీ రూ.3000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3000 లాయల్టీ బోనస్ అందిస్తోంది. జాబితాలో చేర్చబడిన స్కూటర్లలో ప్లెజర్+ BS6, డెస్టినీ 125, మాస్ట్రో ఎడ్జ్ 125, మాస్ట్రో ఎడ్జ్ 110, కొత్త మాస్ట్రో ఎడ్జ్ 125 ఉన్నాయి. వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌కు కాల్ చేయడం ద్వారా మీరు మిగిలిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. హీరో మోటోకార్ప్ 2011 లో ప్రపంచం ముందు వచ్చింది. ఇప్పుడు తన తన 10 వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.

Vikarabad District: కారు గల్లంతు ఘటనలో డ్రైవర్‌ ఆచూకీ లభ్యం.. వరదలో చెట్టు కొమ్మ చిక్కడంతో

Penkutillu: తాత తండ్రుల లోగిళ్లు.. పెద్దరికానికి చిహ్నాలు.. పల్లెటూర్లలో పెంకుటిల్లు.. ఆ ఆలోచనకు రూపం యాదగిరి ఇల్లు

Milk With Anjeer Figs: రాత్రి పడుకునే ముందు పాలు, అంజీర్ కలిపి తీసుకోవచ్చా ? ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..