Success Story: ఈ మహిళ నిజంగా మహరాణే.. సాఫ్ట్ వేర్ సామ్రాజ్యాన్ని ఏలుతోంది.. పూర్తి వివరాలు ఇవి..

రాధా వెంబు సాధించిన విజయాలు మహిళలతో పాటు అందరికీ స్పూర్తి నిస్తాయి. ఆమె చెన్నైలో అత్యంత ధనవంతురాలు. ఇక దేశంలోని సంపన్న సెల్ఫ్ మేడ్ మహిళా వ్యాపారావేత్తగా పేరుగాంచారు. రాధా వెంబు 1972 డిసెంబరు 24న చెన్నైలో జన్మించారు. అక్కడే తన పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు.

Success Story: ఈ మహిళ నిజంగా మహరాణే.. సాఫ్ట్ వేర్ సామ్రాజ్యాన్ని ఏలుతోంది.. పూర్తి వివరాలు ఇవి..
Chennai’s Richest Woman Radhavembu
Follow us
Madhu

|

Updated on: Sep 16, 2024 | 1:54 PM

మహిళలు అన్ని రంగాల్లో అద్భుత ప్రతిభ చూపుతూ దూసుకుపోతున్నారు. విద్య, ఉద్యోగాలలో తమ సత్తా చాటుతున్నారు. ఇక వ్యాపార రంగంలో కూడా తమ ముద్ర వేసుకుని ప్రగతి పథంలో పయనిస్తున్నారు. పురుషులతో సమానంగా, అంతకు మించి కూడా విజయాలు సాధిస్తున్నారు. చెన్నైకి చెందిన రాధా వెంబు కూడా వీరిలో ఒకరు. అలాగే అత్యంత సంపన్నురాలైన మహిళ. ఈమె రూ.8,703 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈమె కంపెనీ రూ.47,500 కోట్ల నికర విలువ కలిగి ఉంది. రాధా వెంబు జీవితం, ఆమె సాధించిన విజయాలు గురించి తెలుసుకుందాం.

స్ఫూర్తిదాయక ప్రయాణం..

రాధా వెంబు సాధించిన విజయాలు మహిళలతో పాటు అందరికీ స్పూర్తి నిస్తాయి. ఆమె చెన్నైలో అత్యంత ధనవంతురాలు. ఇక దేశంలోని సంపన్న సెల్ఫ్ మేడ్ మహిళా వ్యాపారావేత్తగా పేరుగాంచారు. రాధా వెంబు 1972 డిసెంబరు 24న చెన్నైలో జన్మించారు. అక్కడే తన పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు. అనంతరం మద్రాసులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి వెళ్లారు. 1997లో ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్‌లో పట్టభద్రురాలయ్యారు.

జోహో కార్పొరేషన్..

రాధా వెంబు 1996లో తన సోదరుడు శ్రీధర్ వెంబుతో కలిసి జోహో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆమె ఉన్నత విద్యను అభ్యసిస్తున్నప్పుడే ఈ వెంచర్ రూపుదిద్దుకుంది. సాఫ్ట్ వేర్ రంగానికి ఉన్న ప్రాధాన్యతను ఆమె అప్పుడే గుర్తించారు. ఈ విషయం రాధా వెంబు వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం చెన్నై ప్రధాన కార్యాలయంగా కొనసాగుతున్న జోహో కార్పొరేషన్ రూ. 8,703 కోట్ల ఆదాయంతో సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది.

మరిన్ని విజయాలు..

జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకురాలిగా, సీఈవోగా రాధా వెంబు పనిచేస్తున్నారు. కంపెనీని నడిపించడం, దాన్ని విస్తరించడం, క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో విజయ పథాన తీసుకువెళ్లడానికి ఆమె ఎంతో పనిచేశారు. దీనితోపాటు హైలాండ్ వ్యాలీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ, వ్యవసాయ ఎన్ జీవో అయిన జానకి హై టెక్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

మహిళలకు ఆదర్శం..

దేశంలోని వ్యాపార రంగంలో సాధారణంగా పురుషులదే ఆధిపత్యం. ఈ రంగంలో రాధా వెంబు సాధించిన విజయం మహిళలందరికీ ఆదర్శం. 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. రాధా వెంబుతో పాటు ఇంకొందరు మహిళా పారిశ్రామికవేత్తల గురించి తెలిపింది. వారిలో నైకాకు చెందిన ఫల్గుణి నాయర్, అరిస్టా నెట్‌వర్క్స్‌కు చెందిన జయశ్రీ ఉల్లాల్ ఉన్నారు. వీరి ఆస్తుల నికర విలువ రూ. 32 వేల కోట్లుగా తెలిపింది.

పెరుగుతున్న బిలియనీర్లు..

మనదేశంలో బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2024వ సంవత్సరంలో సుమారు 334 మంది ఈ జాబితాలో చేరారు. ఈ సంఖ్య గత ఏడాది కంటే దాదాపు 75 పెరిగింది. ఈ వృద్ధి దేశంలోని వ్యవస్థాపక స్ఫూర్తిని, ఆర్థిక చైతన్యాన్ని తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ సంపద మ్యాప్‌లో ముంబై, చెన్నై నగరాలకు ప్రముఖ స్థానం లభించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..