Telugu News Business Here is the Passport Renewal Procedure in simple terms, check details in telugu
Passport Renewal: మీ పాస్ పోర్ట్ ఎక్స్ పైరీ డేట్ దగ్గరపడిందా? ఇంట్లోనే నుంచే ఈజీగా రెన్యూవల్ చేసుకోండి..
పాస్ పోర్టు నిబంధనల విషయానికి వస్తే 18 ఏళ్లు దాటిన వారికి జారీ చేసిన రోజు నుంచి పదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. తర్వాత దానిని పునరుద్ధరణ (రెన్యువల్) చేసుకోవాలి. పాస్ పోర్టు గడువు ముగిసిన మూడేళ్ల వరకూ లేదా గడువు ముగియడానికి ఏడాది ముందుగా రెన్యువల్ చేసుకునే వీలు ఉంది. ఏదేమైనా పాస్ పోర్టు గడువు ముగియడానికి తొమ్మిది నెలల ముందుగా పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభించడం మంచిది.
నేడు విదేశీ ప్రయాణాలు చేయడం సర్వసాధారణ విషయంలా మారింది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విహారం,వైద్యం తదితర వాటి కోసం అనేక మంది విదేశాలకు వెళుతున్నారు. అలాంటి వారికి పాస్ పోర్టు అనేది చాలా అవసరం. అది మన జాతీయతను నిర్ధారించే గుర్తింపు పత్రం అని చెప్పవచ్చు. దేశంలోని పౌరులందరూ పాస్ పోర్టును పొందవచ్చు. భారత ప్రభుత్వం అర్హులందరికీ దీనిని మంజూరు చేస్తుంది. అయితే దీనికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. నిర్ణీత సమయానికి దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఆ వివరాలను తెలుసుకుందాం.
నిబంధనలు..
పాస్ పోర్టు నిబంధనల విషయానికి వస్తే 18 ఏళ్లు దాటిన వారికి జారీ చేసిన రోజు నుంచి పదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. తర్వాత దానిని పునరుద్ధరణ (రెన్యువల్) చేసుకోవాలి. పాస్ పోర్టు గడువు ముగిసిన మూడేళ్ల వరకూ లేదా గడువు ముగియడానికి ఏడాది ముందుగా రెన్యువల్ చేసుకునే వీలు ఉంది. ఏదేమైనా పాస్ పోర్టు గడువు ముగియడానికి తొమ్మిది నెలల ముందుగా పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభించడం మంచిది. అలాగే మైనర్లకు కూడా పాస్ పోర్టులు జారీ చేస్తారు. ఐదేళ్ల కాలపరిమితి లేదా వారికి 18 ఏళ్లు వచ్చేవరకూ చెల్లుబాటులో ఉంటాయి.
కొత్త వినియోగదారుగా నమోదు చేసుకోవాలి. లేదా మీరు ఇప్పటికే ఉన్న వినియోగదారు అయితే లాగిన్ అవ్వండి.
తాజా పాస్‌పోర్ట్/పాస్‌పోర్ట్ రీ-ఇష్యూ కోసం దరఖాస్తు చేయండి అనే దానిపై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి ఆప్షన్ ను ఎంచుకోండి.
పేరు, చిరునామా, ఇతర వివరాలను సక్రమంగా నమోదు చేయాలి.
అత్యవసర సమయంలో సంప్రదించడానికి వివరాలు, మునుపటి పాస్‌పోర్ట్ వివరాలను నమోదు చేయండి.
అనంతరం ఫారంను సబ్మిట్ చేయండి.
పాస్‌పోర్ట్ పునరుద్ధరణ రుసుం చెల్లించడానికి, అపాయింట్‌మెంట్ షెడ్యూల్ కు వెళ్లండి
అపాయింట్‌మెంట్ షెడ్యూల్ విధానం..
పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌కి లాగిన్ చేయండి.
మీ ఇంతకు ముందు సబ్మిట్ చేసిన దరఖాస్తును వీక్షించండి అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
చెల్లింపులు, అపాయింట్‌మెంట్ షెడ్యూల్ పై క్లిక్ చేయాలి.
చెల్లింపు పద్ధతి, పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (పీఎస్ కే)ను ఎంపిక చేసుకోవాలి.
క్యాప్చా కోడ్ నమోదు చేయడం ద్వారా మీ పీఎస్ కేను నిర్ధారించుకోండి.
అక్కడ అందుబాటులో ఉన్న తేదీలలో మీకు అనుకూలమైన స్లాట్‌ను ఎంచుకోవాలి. పే అండ్ బుక్ అపాయిట్మెంట్ పై క్లిక్ చేయండి.
మన వయసు, మనం ఎంచుకున్న సాధారణ, తత్కాల్ పథకాల ప్రకారం రెన్యువల్ ఫీజు ఉంటుంది. తత్కాల్ పథకంలో వేగంగా పని కావాలంటే అదనంగా రూ.2000 చెల్లించాలి.
ఒరిజినల్ పాస్‌పోర్ట్, అప్లికేషన్ రశీదు, ధ్రువీకరణ పత్రాలు, చిరునామా రుజువు తదితర వాటిని అప్‌లోడ్ చేయాలి.
తర్వాత మీకిచ్చిన అపాయింట్‌మెంట్ తేదీలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి.
రెన్యువల్ స్టేటస్ తెలుసుకోండి ఇలా..
పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ను ఎంచుకోండి.
అప్లికేషన్ రకం, ఫైల్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయండి.
ట్రాక్ స్టేటస్ పై క్లిక్ చేస్తే మీ పాస్ పోర్ట్ పరిస్థితి తెలుస్తుంది.
పాస్ పోర్ట్ ప్రాసెసింగ్ సమయం అనేది మనం ఎంచుకున్న స్కీమ్‌పై ఆధారపడి ఉంటుంది, సాధారణ స్కీమ్‌కు 30-60 రోజులు పడుతుంది, తత్కాల్ స్కీమ్ లో 3 – 7 రోజుల్లో పూర్తవుతుంది.