Honda CD 100: కిర్రాక్ లుక్.. కిల్లింగ్ ఫీచర్స్‪తో ఐకానిక్ బైక్ మళ్లీ వచ్చేస్తోంది.. వివరాలు ఇవి..

|

Mar 08, 2023 | 2:42 PM

సీడీ 100 బైక్ ని మళ్లీ రీ లాంచ్ చేసేందుకు హోండా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనిని చైనాలో ఆవిష్కరించారు. సీజీ 125 పేరిట ఆకర్షణీయ లుక్ లో దీనిని విడుదల చేశారు. త్వరలోనే మన భారతదేశంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.

Honda CD 100: కిర్రాక్ లుక్.. కిల్లింగ్ ఫీచర్స్‪తో ఐకానిక్ బైక్ మళ్లీ వచ్చేస్తోంది.. వివరాలు ఇవి..
Honda Cd 100
Follow us on

హీరో హోండా సీడీ100 ఒకప్పుడు మధ్య తరగతి ప్రజలకు ఐకానిక్ బైక్. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారు. ఎందుకంటే ఆ బైక్ పనితీరు, మైలేజీ, అలాగే తక్కువ ధరలోనే లభిస్తుండటంతో అందరూ దీనిని ఇష్టపడేవారు. అయితే హీరో హోండా కంపెనీ హీరో మోటార్ కార్ప్, హోండాగా విడిపోయిన తర్వాత ఈ బైక్ ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఇప్పుడు దీనిని మళ్లీ రీ లాంచ్ చేసేందుకు హోండా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనిని చైనాలో  ఆవిష్కరించారు. సీజీ 125 పేరిట ఆకర్షణీయ లుక్ లో దీనిని విడుదల చేశారు. త్వరలోనే మన భారతదేశంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ బైక్ సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..

ఆ కంపెనీలకు పోటీగా..

హోండా సీడీ 100 ని అప్ గ్రేడ్ చేసి రీలాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా హీరో, బజాజ్, టీవీఎస్ కంపెనీలకు పోటీగా దీనిని తీసుకురానున్నట్లు చెబుతున్నారు. కొత్త లుక్ లో, కొత్త పేరుతో, నయా ఫీచర్లతో హోండా ఈ బైక్ ను లాంచ్ చేయబోతోంది.

చైనాలో ఇలా..

జపాన్‌కు చెందిన బైక్‌ల తయారీ సంస్థ హోండాకు చెందిన చైనా అనుబంధ కంపెనీ వుయాంగ్ హోండా తాజాగా సీజీ125 పేరిట ఈ బైక్ ను చైనా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.అక్కడ దీని ధర 7,480 యువాన్ల ఉంది. అంటే మన దగ్గర దాని ధర రూ. 89,800 ఉండొచ్చు. పాత రెట్రో స్టైల్ లో వైట్ అండ్ బ్లూ కలర్ లో ఈ స్పెషల్ ఎడిషన్ ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ లుక్ లో మన దేశంలో విక్రయించబడుతున్న హోండా హైనెస్ సీబీ 350కి దగ్గరగా ఉంది.

ఇవి కూడా చదవండి

లాంచింగ్ ఎప్పుడంటే..

ఈ బైక్‌ను భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెడతారనే దాని గురించి కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు, అయితే కంపెనీ భారతదేశంలో అనేక సరసమైన, మెరుగైన మైలేజ్ మోడల్‌లను విడుదల చేయనున్నట్లు కొంతకాలం క్రితం హోండా ఒక ప్రకటనలో తెలిపింది. అందువల్ల, కంపెనీ త్వరలో ఈ బైక్‌ను భారతదేశంలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..