Pollution: అక్కడ బీఎస్3, బీఎస్4 వాహనాలపై నిషేధం.. మీ వాహనం ఏ రకం.. తెలీదా? ఇలా చెక్ చేసుకోండి..

| Edited By: Ravi Kiran

Nov 09, 2023 | 9:20 PM

పాత కార్లలో అయితే ఇవి మరింత గరిష్ట స్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బీఎస్6 కంప్లైంట్ వాహనాలను తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం బీఎస్3, బీఎస్4, వాహనాలు కూడా రోడ్లపై తిరుగుతున్నాయి. దీంతో ఢిల్లీలో బీఎస్3, బీఎస్4 వాహనాలపై తాత్కాలికంగా బ్యాన్ విధించారు. ఈ క్రమంలో ఏది బీఎస్6, ఏది బీఎస్3, బీఎస్4 వాహనమో తెలుసుకోవడం ఎలా?

Pollution: అక్కడ బీఎస్3, బీఎస్4 వాహనాలపై నిషేధం.. మీ వాహనం ఏ రకం.. తెలీదా? ఇలా చెక్ చేసుకోండి..
Delhi Pollution
Follow us on

ఢిల్లీలో కాలుష్యం తార స్థాయికి చేరింది. చాలా భయానక, ఆందోళన కర వాతావరణం అక్కడ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలను తీసుకుంటోంది. ఎలాగైన పరిస్థితిని అదుపు చేసేందుకు ఈ ప్రయత్నాలు చేస్తోంది. కఠినమైన జీఆర్ఏపీ4 మార్గదర్శకాలను సైతం అమలు చేస్తోంది. అంతేకాక వాహనాల నంబర్లను బట్టి సరి-బేసి విధానంలో అవి బయటకు తిరిగేలా కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చింది. ఇది నవంబర్ 13 నుంచి నవంబర్ 20 వరకూ అమలు చేయనుంది. వాహనదారులు ఈ నిబంధనలు పాటించకపోతే భారీ ఫైన్ వేయాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఆ ఫైన్ దాదాపు రూ. 20,000 వరకూ ఉంటుంది. కారు విడుదల చేసి పొగలో హానికరమైన వాయువులు ఉంటున్నాయి. పైగా పాత కార్లలో అయితే ఇవి మరింత గరిష్ట స్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బీఎస్6 కంప్లైంట్ వాహనాలను తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం బీఎస్3, బీఎస్4, వాహనాలు కూడా రోడ్లపై తిరుగుతున్నాయి. దీంతో ఢిల్లీలో బీఎస్3, బీఎస్4 వాహనాలపై తాత్కాలికంగా బ్యాన్ విధించారు. ఈ క్రమంలో ఏది బీఎస్6, ఏది బీఎస్3, బీఎస్4 వాహనమో తెలుసుకోవడం ఎలా? మీది పాత వాహనమైతే అది బీఎస్3నా, లేక బీఎస్4నా అని గుర్తించడం ఎలా తెలుసుకుందాం రండి..

అసలు బీఎస్3, బీఎస్4 అంటే ఏమిటి? బీఎస్3, బీఎస్4 అంటే భారత్ స్టేజ్3, భారత్ స్టేజ్ 4 ఎమిషన్ స్టాండర్డ్స్ అని అర్థం. పర్యావరణానికి హాని కలిగించే కర్బన ఉద్ఘారాలను అదుపు చేసేందుకు ఈ గ్రేడింగ్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిలో బీఎస్3తో పోల్చితే, బీఎస్4 అనేది పర్యావరణ హితమైన వాహనంగా చెప్పొచ్చు.

గుర్తించడం ఎలా..

మీ వాహనం బీఎస్3, బీఎస్4 అనేది గుర్తించడం ఎలా? అందుకోసం మీరు ముందుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూడాలి. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూడటం అనేది మీరు కర్బన ఉద్ఘారాల పరిస్థితిని తెలుసుకోవచ్చు. దీనిని సాధారణంగా ఆర్సీ బుక్ అని పిలుస్తారు. దీనిలో మీరు ఎమిషన్ స్టాండర్డ్ అనే కాలమ్ లో ఫ్యూయల్ యూజ్డ్ అని సెక్షన్ ఉంటుంది. దానిలో మీ బీఎస్4 అయితే రాసి ఉంటుంది. ఆ ఆర్సీలో ఏది రాసి ఉంటే అదే మీ వాహనం స్టాండర్డ్.

ఇవి కూడా చదవండి

యజమాని మాన్యువల్.. మీ కారు యజమానికి సంబంధించిన మాన్యువల్ ఉంటుంది. కారు కొన్నప్పుడే ఆ మాన్యువల్ వస్తుంది. దానిలో ఎమిషన్ స్టాండర్డ్ మెన్షన్ చేసి ఉంటుంది.

మ్యానుఫ్యాక్చర్ వెబ్ సైట్లో.. కారు తయారీదారుల వెబ్ సైట్లో ఆ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరుచుతారు. కారు మోడల్ ను వెబ్ సైట్లో సెర్చ్ చేసి, పూర్తి వివరాలు చూడొచ్చు.

డీలర్ నుంచి తెలుసుకోవచ్చు.. అప్పటిక మీకు క్లారిటీ రాకపోతే.. మీ మ్యానుఫ్యాక్చర్ ను డైరెక్ట్ గా కలవొచ్చు. లేదా సమీపంలోని డీలర్ ను సంప్రదిస్తే సరిపోతోంది.

సైలెన్సర్ ను తనిఖీ చేయడం ద్వారా.. మీరు కారు కిందకు వెళ్లి చూడగలిగితే.. సైలెన్సర్ పైప్ పై కూడా ఈ కారు ఎమిషన్ స్టాండర్డ్స్ లేబుల్ చేసే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..