Credit Card Limit: ఈజీగా క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం ఎలా? అలా చేయడం లాభామా? నష్టమా?

|

Aug 01, 2023 | 1:36 PM

కొంతమంది రెండు మూడు క్రెడిట్ కార్డులను కూడా కలిగి ఉంటున్నారు. అయితే వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం అందరికీ చేతకాదు. కార్డుల్లో క్రెడిట్ లిమిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దానిని పెంచుకునే విధానంపై అవగాహన ఉండదు. దీంతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో అసలు క్రెడిట్ కార్డు లిమిట్ ఎలా ఇస్తారు? ఏ ప్రాతిపదికన లిమిట్ పెరుగుతుంది? తెలుసుకుందాం రండి..

Credit Card Limit: ఈజీగా క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం ఎలా? అలా చేయడం లాభామా? నష్టమా?
Credit Card
Follow us on

క్రెడిట్ కార్డు.. ఇటీవల కాలంలో అందరూ విరివిగా వినియోగిస్తున్న పేరు. అత్యవసర పరిస్థితుల్లో అండగా ఉండటంతో పాటు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో రివార్డులు, క్యాష్ బ్యాక్ లు, ఆఫర్లు ఉంటుండంటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఒక్కటైనా క్రెడిట్ కార్డు కలిగి ఉండాలని భావిస్తున్నారు. కొంతమంది రెండు మూడు కార్డులను కూడా కలిగి ఉంటున్నారు. అయితే దానిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం అందరికీ చేతకాదు. అలాగే కొందరి కార్డుల్లో మనీ లిమిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దానిని పెంచుకునే విధానంపై అవగాహన ఉండదు. దీంతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో అసలు క్రెడిట్ కార్డు లిమిట్ ఎలా ఇస్తారు? ఏ ప్రాతిపదికన లిమిట్ పెరుగుతుంది? ఒకవేళ వినియోగదారుడే లిమిట్ పెంచుకోవాలనంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

ఇలా సులభంగా లిమిట్ పెంచుకోవచ్చు..

సులభంగా క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవాలంటే మీ కార్డు వినియోగం సక్రమంగా ఉండాలి. పరిధి దాటకుండా ఖర్చు చేయడం, సకాలంలో పూర్తి బిల్లును చెల్లించడం వంటి చేస్తే ఆటోమేటిక్ గా బ్యాంక్ వారే మిమ్మల్ని కార్డు లిమిట్ పెంచుకోమని అడుగుతారు. అలాగే మీ ఆదాయం పెరిగితే క్రెడిట్ కార్డు లిమిట్ కూడా పెరుగుతుంది. మీ బ్యాంకుకు అప్ డేట్ అయిన శాలరీ పే స్లిప్ లను అందించడం ద్వారా కార్డులను అప్ డేట్ చేసుకోవచ్చు. కొత్త కార్డు వస్తుందంటే అది కచ్చితంగా లిమిట్ పెరిగే వస్తుంది. అలా ఆటోమేటిక్ గా లిమిట్ పెరగని పక్షంలో మీరు ప్రత్యేకంగా బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధిక లిమిట్ అందించే కార్డును జారీ చేయవలసినదిగా కోరవచ్చు.

ప్రయోజనాలు ఏమిటి?

మీరు క్రెడిట్ కార్డును అవగాహనతో వినియోగిస్తే దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. లిమిట్ ఉంది కదా అని ఎక్కువగా ఉన్న మొత్తాన్ని వినియోగించకూడదు. మీ కున్న లిమిట్ లో 30 నుంచి 40శాతం వరకూ మాత్రమే వినియోగించుకుంటూ ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు, రివార్డులను వాడుకుంటూ ఉంటే క్రెడిట్ కార్డు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాక అధిక లిమిట్ ఉంటే కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవేంటో చూద్దాం..

ఇవి కూడా చదవండి

క్రెడిట్ స్కోర్‌ మెరుగవుతుంది.. క్రెడిట్ కార్డు పద్ధతిగా వాడుతూ.. సమయానికి బిల్లులు చెల్లిస్తూ ఉంటే మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఈ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే అనేక ప్రయోజనాలుంటాయి. ఆర్థిక సంస్థలకు మీపై నమ్మకం ఏర్పడుతుంది. తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తాయి. క్రెడిట్ లిమిట్ కూడా ఎంకా పెంచుకునే అవకాశం కల్పిస్తాయి.

ఒకే కార్డుతో మేలు..  తక్కువ లిమిట్ ఉన్న కార్డులను రెండు మూడు వాడటం.. సమయానికి ఆ బిల్లలు కట్టడం కష్టంగా మారుతుంది. అందుకే అధిక లిమిట్ ఉన్న ఒకే కార్డును వాడుతూ ఉంటే మీకు నిర్వహణ సులభతరం అవుతుంది. అలాగే మీరు ఎంత వాడుతున్నారు? ఎంత లిమిట్ ఉంది. మన ఖర్చులు ఏమిటి అన్న విషయంలో స్పష్టత ఉంటుంది. అదే సమయంలో, అధిక క్రెడిట్ లిమిట్ ఉన్న వ్యక్తులు బ్యాంకులచే ఆధారపడదగిన వారిగా పరిగణించబడతారు, తద్వారా వారికి తగ్గిన వడ్డీ రేట్ల వద్ద రుణాలను పొందడం సులభం అవుతుంది.

ఎక్కువ రివార్డులు.. చివరగా, ఎక్కువ ఖర్చు చేసే శక్తి ఎక్కువ రివార్డులకు సమానం. తమ బిల్లులను పూర్తిగా, సమయానికి చెల్లించడంలో శ్రద్ధ చూపే వారు మరిన్ని రివార్డ్‌లను పొందుతారు. బ్యాంకులు తరచుగా అధిక లిమిట్ కార్డ్ హోల్డర్‌లను విలువైన కస్టమర్‌లుగా పరిగణిస్తాయి. అదనపు రివార్డ్ పాయింట్‌లు, ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రివార్డ్‌లు విమాన ప్రయాణం, బహుమతి కొనుగోళ్లు వంటి రంగాల్లో ఖర్చులను తగ్గిస్తాయి.

ఇవి సరిచూసుకోండి..

లిమిట్ పెంచుకునే ముందు మీరు మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి. లిమిట్ ఎక్కువ ఉంటే ఖర్చులు కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. అయితే అది తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం ఉందా లేదా అన్నది చూసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. క్రెడిట్ కార్డు బిల్లులు సమయానికి చెల్లించకపోతే భారీగా వడ్డీ వసూలు చేస్తారు. అప్పుల ఊబిలోకి దించేస్తుంది. పైగా అది మీ క్రెడిట్ స్కోర్ ను భారీగా దెబ్బతీస్తుంది. అందుకే క్రెడిట్ వినియోగంపై అవగాహనతో ముందుకెళ్లాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..