LIC Saral Pension Plan: ఈ ఎల్ఐసీ ప్లాన్‌లో చేరితే.. రూ. లక్ష వరకూ పెన్షన్.. వివరాలు ఇవి..

|

Jun 26, 2024 | 6:04 PM

అలాంటి పథకాల్లో ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ ఒకటి. దీనిని ఎల్ఐసీ 2022 ఆగస్టులో ప్రారంభించింది. ఇన్ స్టంట్ యాన్యుటీ ప్లాన్. అంతేకాక నాన్-లింక్డ్ నాన్-పార్టిసిపేటింగ్ అప్‌ఫ్రంట్ సింగిల్ ప్రీమియం పథకం. ఈ ప్లాన్ ప్రారంభం నుంచి దాదాపు 5 శాతం యాన్యుటీ రేటు హామీ అందిస్తుంది. దీనిలో నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షిక చెల్లింపును ఎంచుకునే అవకాశం ఉంది.

LIC Saral Pension Plan: ఈ ఎల్ఐసీ ప్లాన్‌లో చేరితే.. రూ. లక్ష వరకూ పెన్షన్.. వివరాలు ఇవి..
Lic Saral Pension Plan
Follow us on

మన దేశంలో అనేక రకాల కంపెనీలు, విభిన్న రకాల పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంటేనే జనాలకు బాగా నమ్మకం. అన్ని రంగాల ప్రజలకు అవసరమైన ప్లాన్లను ఇందులో అందుబాటులో ఉండటం.. కేంద్ర ప్రభుత్వం భరోసా కూడా లభిస్తుండటంతో అందరూ వీటిల్లో పెట్టుబడులు పెడతారు. జీవిత బీమాతో పాటు అనేక రకాల ప్లాన్లు ఇక్కడ ఉన్నాయి. అలాంటి పథకాల్లో ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ ఒకటి. దీనిని ఎల్ఐసీ 2022 ఆగస్టులో ప్రారంభించింది. ఇన్ స్టంట్ యాన్యుటీ ప్లాన్. అంతేకాక నాన్-లింక్డ్ నాన్-పార్టిసిపేటింగ్ అప్‌ఫ్రంట్ సింగిల్ ప్రీమియం పథకం. ఈ ప్లాన్ ప్రారంభం నుంచి దాదాపు 5 శాతం యాన్యుటీ రేటు హామీ అందిస్తుంది. దీనిలో నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షిక చెల్లింపును ఎంచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ అర్హతలు.. రాబడి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అర్హతలు ఇవి..

40 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ యాన్యుటీ పెన్షన్ స్కీమ్‌ను సబ్‌స్క్రైబ్ చేయడానికి లేదా కొనుగోలు చేయడానికి అర్హులు.

పెన్షన్ కాలిక్యులేటర్..

ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సరళ్ పెన్షన్ ప్లాన్ వివరాల ప్రకారం, పాలసీదారు ఈ పథకం కింద కనీసం రూ.1,000 నెలవారీ పెన్షన్ లేదా రూ. 12,000 వార్షిక పెన్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ కనీస పెన్షన్ కోసం, ఒకరు రూ.2.50 లక్షలను ఒకేసారి సింగిల్ ప్రీమియం చెల్లించాలి . ఒక పెట్టుబడిదారు రూ.10 లక్షల సింగిల్ ప్రీమియం పెట్టుబడిపై రూ. 50,250 వార్షిక పెన్షన్ పొందుతారు . అదేవిధంగా, పెట్టుబడిదారుడు ఈ పథకం కింద రూ.1 లక్ష వార్షిక పెన్షన్ కావాలనుకుంటే, రూ. 20 లక్షల ప్రీమియం చెల్లింపును ముందస్తుగా చెల్లించాలి .

ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ ప్రయోజనాలు ఇవి..

  • లోన్ బెనిఫిట్: ఈ ప్లాన్ లో పెట్టుబడి ప్రారంభించి ఆరు నెలలు పూర్తయిన తర్వాత, లోన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
  • ఎగ్జిట్ ప్లాన్: ప్రారంభించిన ఆరు నెలల తర్వాత ఎల్‌ఐసి సరళ్ పెన్షన్ ప్లాన్ నుంచి నిష్క్రమించవచ్చు.
  • వడ్డీ రేటు: యాన్యుటీ ప్లాన్ దాదాపు 5 శాతం వార్షిక రాబడిని హామీ ఇస్తుంది.
  • జీవితకాల పెన్షన్ ప్రయోజనం: ఎల్ఐసీ సరళా పెన్షన్ ప్లాన్ అనేది మొత్తం జీవిత పాలసీ, అంటే పాలసీదారు ప్రారంభించిన తర్వాత జీవితాంతం వార్షిక లేదా నెలవారీ పెన్షన్‌కు అర్హులు.
  • నామినీకి డెత్ బెనిఫిట్: ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ సబ్‌స్క్రైబర్ మరణించిన తర్వాత, బేస్ ప్రీమియం నామినీకి తిరిగి చెల్లిస్తారు.
  • మెచ్యూరిటీ ప్రయోజనం లేదు: ఎల్‌ఐసి సరళా పెన్షన్ ప్లాన్‌లో, పాలసీదారు జీవించి ఉన్నంత వరకు పెన్షన్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి మెచ్యూరిటీ ప్రయోజనం ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..