AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMMVY Scheme: గర్భిణులకు వరం ఈ పథకం.. రూ. 5,000 నేరుగా ఖాతాలోకే వచ్చేస్తాయి.. వివరాలు ఇవి..

కేంద్ర ప్రభుత్వం ప్రసూతి మహిళలకు ఓ ప్రత్యేక పథకాన్ని అందిస్తోంది. దాని పేరు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై). దీని ప్రధాన ఉద్దేశం గర్భిణుల ఆరోగ్యాన్ని కాపాడటం. ఇప్పటికే లక్షల మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనం పొందారు.

PMMVY Scheme: గర్భిణులకు వరం ఈ పథకం.. రూ. 5,000 నేరుగా ఖాతాలోకే వచ్చేస్తాయి.. వివరాలు ఇవి..
Pregnant Woman
Madhu
|

Updated on: May 04, 2023 | 11:42 AM

Share

మహిళకు అమ్మా అని పిలిపించుకున్నప్పుడే పరిపూర్ణత అని పెద్దలు చెబుతూ ఉంటారు. నిజమే మాతృత్వంలోని మధురిమను ఆస్వాదించాలే తప్ప వర్ణించలేం. అయితే గర్భం దాల్చడం.. ఆ గర్భాన్ని కాపాడుకోవడం, ప్రసవ వేదన భరించి మరో ప్రాణాన్ని ఈ భూమి మీదకు తీసుకురావడం అంటే ఆ తల్లికి మరో జన్మ ఎత్తినట్టే. ఆ సమయంలో తల్లి ఆరోగ్యం కూడా ప్రధానమే. తొమ్మిది నెలల పాటు తల్లి తన ఆరోగ్యంతో పాటు, కడుపులోని శిశువు ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. రెగ్యూలర్ వైద్యుల వద్దకు వెళ్లాలి.. మందులు వాడాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్నది. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రసూతి మహిళలకు ఓ ప్రత్యేక పథకాన్ని అందిస్తోంది. దాని పేరు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై). దీని ప్రధాన ఉద్దేశం గర్భిణుల ఆరోగ్యాన్ని కాపాడటం. ఇప్పటికే లక్షల మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనం పొందారు. ఇప్పటికీ ఈ పథకం గురించి మీకు తెలీదా.. అయితే ఈ కథనం మీ కోసమే.. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇది పథకం..

కేంద్ర ప్రభుత్వం మాతృ వందన యోజన పథకం కింద మహిళలకు రూ. 5 వేలు అందిస్తుంది. ఈ రూ.5 వేలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే వేస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. విడతల వారీగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. మూడు విడతల్లో డబ్బులు.. మాతృ వందన యోజన స్కీమ్ కింద మూడు విడతల్లో గర్భిణులకు డబ్బులు వేస్తారు. తొలి విడత కింద రూ.1000 ఈ పథకంలో రిజిస్టర్ అవ్వగానే వస్తాయి. తర్వాత రెండో విడత కింద గర్భిణి ఆరో నెలలో ఉండగా రూ.2 వేలు లభిస్తాయి. అలాగే చివరి విడతలో మరో రూ.2 వేలు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వస్తాయి.

రిజిస్ట్రేషన్ ఇలా..

మీరు ఈ స్కీమ్‌లో చేరాలంటే ఆన్‌లైన్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఆశా వర్కర్ మిమ్మల్ని ఈ స్కీమ్‌లో చేర్పిస్తారు. https://pmmvy.nic.in/Account/Citizenlogin లింక్ ద్వారా మీరు నేరుగా స్కీమ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు.

ఇవి కూడా చదవండి

వీరు అర్హులు..

  • గర్భం దాల్చిన మహిళలు అందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
  • తొలి ప్రసవానికి మాత్రమే పథకం కింద డబ్బులు వస్తాయి. రెండో ప్రసవానికి అర్హులు కారు.
  • అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలులో ఉంటుంది.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కారు.
  • పథకం కింద ప్రయోజనం పొందాలని భావిస్తే.. ఎల్ఎంపీ డేట్ కచ్చితంగా కావాలి. ఎంసీపీ కార్డు కూడా కలిగి ఉండాలి. వీటిని మీరు మీ ఆశ వర్కర్ దగ్గర తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా