Ola S1 Air vs Ather 450S: ఓలాకు పోటీగా ఏథర్ కొత్త స్కూటర్.. రెండింటిలో ఏది బెటర్.. పూర్తి వివరాలు ఇవి..

|

Aug 02, 2023 | 4:30 PM

ప్రస్తుతం మార్కెట్లో సరసమైన ధరలోనే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను ఓలా స్కూటర్లు ఆకర్షిస్తున్నాయి. అయితే ఓలా ఇటీవల ఓ కొత్త స్కూటర్ ను లాంచ్ చేసింది. దాని పేరు ఓలా ఎస్1 ఎయిర్. అలాగే ఓలాకు గట్టి పోటి నిచ్చే ఏథర్ కూడా ఓ కొత్త స్కూటర్ ను లాంచ్ చేసింది. దాని పైరు ఏథర్ 450ఎస్.

Ola S1 Air vs Ather 450S: ఓలాకు పోటీగా ఏథర్ కొత్త స్కూటర్.. రెండింటిలో ఏది బెటర్.. పూర్తి వివరాలు ఇవి..
Ola S1 Air Vs Ather 450s
Follow us on

ఎలక్ట్రిక్ వాహనాలు రానురాను ఖరీదైనవిగా మారిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకూ ప్రభుత్వం అందించే ఫేమ్-2(FAME II) సబ్సిడీలో కోత విధించింది. దీంతో అనివార్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లు, కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో సరసమైన ధరలోనే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను ఓలా స్కూటర్లు ఆకర్షిస్తున్నాయి. అయితే ఓలా ఇటీవల ఓ కొత్త స్కూటర్ ను లాంచ్ చేసింది. దాని పేరు ఓలా ఎస్1 ఎయిర్. అలాగే ఓలాకు గట్టి పోటి నిచ్చే ఏథర్ కూడా ఓ కొత్త స్కూటర్ ను లాంచ్ చేసింది. దాని పైరు ఏథర్ 450ఎస్. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్? డిజైన్ ఏది బాగుంది? రేంజ్ ఏది ఎక్కువ ఇస్తుంది? ఫీచర్లు దేనిలో ఎక్కువ ఉన్నాయి? ధర ఎంత? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఓలా ఎస్1 వర్సెస్ ఏథర్ 450ఎస్..

డిజైన్.. రెండు స్కూటర్లు మంచి డిజైన్ తో ఆకర్షణీయంగానే ఉంటాయి. ఎస్1 ఎయిర్ సంప్రదాయ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్‌లు, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక ప్యానెల్‌ల వద్ద బ్లాక్-అవుట్ భాగాన్ని కలిగి ఉంటుంది. ఎస్S1 ప్రో మాదిరిగానే హెడ్‌లైట్ సెటప్‌ను పొందుతుంది, అయితే ఎస్1 ప్రో కంటే 13 కిలోల బరువు తక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఏథర్ 450ఎస్, 450ఎక్స్ డిజైన్ లోనే ఉంటుంది. స్పోర్టీ లుక్ లో కనిపిస్తుంది. దీని కూడా టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్, ఎల్ఈడడీ హెడ్‌లైట్లు, అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

బ్యాటరీ, రేంజ్.. ఓలా ఎస్2 ఎయిర్ స్కూటర్ లో 3kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఈ స్కూటర్ ఎకో మోడ్‌లో 125 కిమీ పరిధిని క్లెయిమ్ చేస్తుంది. బ్యాటరీని 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అదే సమయంలో 450ఎస్ 3kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 115 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

ఫీచర్లు.. ఓలా ఎస్1 ఎయిర్ హైపర్ మోడ్‌తో పాటు ఎస్1 ప్రో పొందే అన్నిఫీచర్లను పొందుతుంది. ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌ను ఉంటుంది. టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది. ఏథర్ మాత్రం ఫీచర్లను కాస్త తగ్గించిందని చెప్పాలి. దీనిలో కూడా డిస్ ప్లే ఉంటుంది. ఫోన్ కనెక్టివిటీ ఉంటుంది. ఇంకా ఇతర విషయాలు వెల్లడికాలేదు.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..