మీరు ఏదైనా బిజినెస్ ప్రారభించాలనే ఆలోచనలో ఉన్నారా? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించే మంచి బిజినెస్ కోసం వెతుకుతున్నారా? అయితే మీ సెర్చింగ్ కు ఇక ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఇక్కడ ఓ స్మార్ట్ బిజినెస్ ఐడియా ఉంది. ప్రతి ఇంట్లో, హోటళ్లలో, ఫ్యాక్టరీలలో, రెస్టారెంట్లలో దీనిని విరివిగా వినియోగిస్తారు. మార్కెట్లోదీనికి అధిక డిమాండ్ ఉంటుంది. అంతేకాక ప్రభుత్వ కూడా దీనికి మీకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఇంతకీ ఏంటా? బిజినెస్? ఎలా ప్రారంభించాలి? లాభాలు ఎలా ఉంటాయి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆ స్మార్ట్ వ్యాపారం పేరు అగ్గిపెట్టెల మేకింగ్. ఇది చిన్న తరహా వ్యాపారం. దీనికి ప్రత్యేక మైన శిక్షణ, జ్ఞానం అవసరం లేదు. ఎవరైనా సులభంగా ప్రారంభించవచ్చు. మహిళలు కూడా ఈ వ్యాపారాన్ని సులభంగా చేయవచ్చు.
అగ్గిపెట్టెలు చెక్క లేదా కార్డ్ బోర్డ్ స్ట్రిప్స్ నుంచి తయారు చేస్తారు. మంటను వెలిగించడానికి అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటిని వంటశాలలు, పారిశ్రామిక సెట్టింగులు, క్యాంప్‌గ్రౌండ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. ఇవి వినియోగదారులకు అనుకూలమైన, మన్నికైన ఉత్పత్తులు. పైగా మార్కెట్ డిమాండ్‌తో ఉంటాయి. ఈ వ్యాపారాన్ని చాలా మితమైన పెట్టుబడితో ప్రారంభించవచ్చు అధిక లాభాన్ని పొందవచ్చు.
అగ్గిపెట్టె తయారీ వ్యాపారం చిన్న లేదా పెద్ద స్థాయిలో ప్రారంభించవచ్చు. భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ద్వారా మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద ఈ రంగంలో వెంచర్లను ప్రారంభించే వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. మీరు అగ్గిపెట్టె తయారీ కోసం బ్యాంకుల నుంచి రూ. 10 లక్షల వరకు ముద్ర రుణాన్ని పొందవచ్చు.
అగ్గిపెట్టె తయారీకి కావాల్సిన ప్రాథమిక ముడి పదార్థాలు ఏంటంటే చెక్క, కార్డ్‌బోర్డ్, రసాయనాలు & ఇతర వినియోగ వస్తువులు (రెడ్ ఫాస్పరస్ వంటివి), కాగితం, ప్యాకింగ్ మెటీరియల్.
అగ్గిపెట్టె తయారీ వ్యాపారానికి మీరు ఎంచుకున్న వ్యాపార రకాన్ని బట్టి యంత్రాలు అవసరం కావచ్చు. చిన్న తరహా వ్యాపారానికి అవసరమైన యంత్రాల సంఖ్య తక్కువగానే ఉంటుంది.
అగ్గిపెట్టెల తయారీ వ్యాపారంపై ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) నివేదిక సిద్ధం చేసింది. అగ్గిపెట్టె తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రూ. 24.61 లక్షలు అవసరం. ఇందులో మీ వాటా రూ. 2.46 లక్షలు ఉంటుంది.
ఔత్సాహికుడి వాటా: రూ. 2.46 లక్షలు
టర్మ్ లోన్: రూ. 15.55 లక్షలు
వర్కింగ్ క్యాపిటల్: రూ. 6.60 లక్షలు
మొత్తం: రూ. 24.61 లక్షలు
మీ అగ్గిపెట్టెలు ప్రత్యేకమైన నాణ్యతను కలిగి ఉంటే.. మీరు దానిని బాగా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వ్యాపారం నుంచి లక్షల విక్రయాలను చూడవచ్చు. మీరు మీ ఉత్పత్తిని విక్రయించడానికి పొరుగు మార్కెట్‌లు, సూపర్ మార్కెట్‌లు, ఇతర రిటైలర్‌లను సంప్రదించవచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు మీ ఉత్పత్తులను ఆన్‌లైన్ సైట్‌లలో కూడా నమోదు చేసుకోవచ్చు.
మ్యాచ్‌బాక్స్ మేకింగ్ బిజినెస్‌పై ఐదేళ్ల ప్రొజెక్టెడ్ ప్రాఫిటబిలిటీ స్టేట్‌మెంట్ ఇస్తున్న కేవీఐసీ ఫీజిబుల్ రిపోర్ట్ మొదటి సంవత్సరంలో రూ. 2.25 లక్షలు, రెండవ సంవత్సరంలో రూ. 3.57 లక్షలు, మూడో సంవత్సరంలో రూ. 6.63 లక్షలు, రూ. 9.89 నికర లాభం చూడవచ్చని పేర్కొంది. నాలుగో సంవత్సరంలో లక్ష, ఐదో సంవత్సరంలో రూ.13.42 లక్షలు ఉంటుందని వివరించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..