పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. ఈ సమయంలో కుటుంబాలుగా టూర్లు ప్లాన్ చేస్తూ ఉంటారు. సాధారణంగా రైళ్లలో ప్రయాణం చేయాల్సి వస్తే కనీసం నెల రోజుల ముందుగానే టికెట్లు బుక్ చేయాల్సి వస్తుంది. తీరా రిజర్వేషన్ కన్ ఫర్మ్ అయిన తర్వాత మన ప్రోగ్రాం మారడమే.. లేక క్యాన్సిల్ అవడమే జరుగుతుంది. ఆ సమయంలో రైలు టికెట్ రద్దు చేయడానికి ప్రయత్నిస్తాం. అయితే ఇలా టికెట్ రద్దు చేయాలంటే కొత్త మొత్తాన్ని చార్జ్‌గా రైల్వే శాఖ వసూలు చేస్తుంది. టికెట్ కన్‌ఫర్మ్ లేదా ఆర్‌ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ ఎలా ఉన్నా కొంత మొత్తాన్ని డిడక్ట్ చేసుకుని మిగిలినది రీఫండ్ చేస్తారు. అసలు ఈ చార్జీలు ఎందుకు వసూలు చేస్తారు. ఎంత వసూలు చేస్తారు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ట్రైన్ టికెట్ రద్దుకు సంబంధించిన చార్జీలు పలు రకాలుగా ఉంటుంది. మీరు టికెట్ తీసుకున్న క్లాస్ ని బట్టి, అలాగే మీ ప్రయాణ తేదికి ఎంత సమయం ముందు టికెట్‌ను రద్దు చేసుకున్నారు అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని చార్జీలు వసూలు చేస్తారు.
భారతీయ రైల్వేలు 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి-తొమ్మిది నెలలో ప్రయాణికుల కేటగిరీలో అంచనా వేసిన ఆదాయం రూ. 48,913 కోట్లకు పెరిగింది. కిందటి ఏడాది కాలంలో వసూలైన మొత్తం రూ. 28,569 కోట్ల కంటే ఇది 71% అధికం. అలాగే ఏప్రిల్ 1 నుంచి 31 డిసెంబర్ 2022 వరకు రిజర్వ్ చేయబడిన ప్యాసింజర్ సెగ్మెంట్‌లో బుక్ చేసిన సుమారు మొత్తం ప్రయాణీకుల సంఖ్య రూ. 59.61 కోట్లుగా ఉంది , గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 56.05 కోట్లు. అంటే ఇది కూడా 6% పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..