Money Management: మీ పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ టిప్స్ ఇవే.. చిన్ననాటి నుంచే అలవాటు చేస్తే మేలు..

|

Feb 22, 2023 | 12:30 PM

మీరు మీ పిల్లలకు డబ్బు నిర్వహణ గురించి ఎంత త్వరగా నేర్పడం ప్రారంభిస్తే అంత మంచిది. మూడు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు డబ్బును లెక్కించడం, ఏదైనా కొనుక్కోవడం వంటి ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోగలరు.

Money Management: మీ పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ టిప్స్ ఇవే.. చిన్ననాటి నుంచే అలవాటు చేస్తే మేలు..
Childsavings
Follow us on

చాలా మంది పెద్దలకు కూడా మనీ మేనేజ్మెంట్ తెలీదు. ఎక్కడ ఖర్చుపెట్టాలి? ఎక్కడ పొదుపు చేయాలి? వంటి విషయాల్లో ఇప్పటికీ చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే చిన్ననాటి నుంచి పిల్లలకు ఆర్థిక నిర్వహణపై కొన్ని టిప్స్ నేర్పిస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. డబ్బు విలువ, పొదుపు చేయాల్సిన అవసరతలను వారికి చిన్ననాటి నుంచే వారికి అర్థమయ్యేలా చేయాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనీ మేనేజ్మెంట్ కు సంబంధించిన కొన్ని చిట్కాలను, పిల్లలకు చిన్ననాటి నుంచి నేర్పాల్సిన కొన్ని విధానాలను ఇప్పుడు చూద్దాం.

చిన్న వయసులోనే ప్రారంభించాలి.. మీరు మీ పిల్లలకు డబ్బు నిర్వహణ గురించి ఎంత త్వరగా నేర్పడం ప్రారంభిస్తే అంత మంచిది. మూడు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు డబ్బును లెక్కించడం, ఏదైనా కొనుక్కోవడం వంటి ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోగలరు. మీ బిడ్డ పెరిగేకొద్దీ బడ్జెట్, పొదుపు, పెట్టుబడి వంటి మరింత లోతైన ఆర్థిక అంశాలను క్రమంగా పరిచయం చేయవచ్చు

మీరే ఓ ఉదాహరణ కావాలి.. పిల్లలకు ఏవైనా ఉదాహరణలు చెప్పడం ద్వారా త్వరగా నేర్చుకుంటారు. ఆ ఉదాహరణ మీరే అయితే ఇంకా బావుంటుంది. కాబట్టి మీరు వారికి బోధించే ముందు ఆచరించడం చాలా ముఖ్యం. మీ బిడ్డకు పొదుపు ప్రాముఖ్యతను తెలియజెప్పాలని కోరుకుంటే, మీరు ప్రతి నెలా పొదుపు కోసం కొంత డబ్బును కేటాయించాలని నిర్ధారించుకోండి. అలాగే పొదుపు చేయాలని వారికి నేర్పించండి.

ఇవి కూడా చదవండి

నెలవారీ ఖర్చులను వివరించండి.. డబ్బు నిర్వహణ గురించి మీ పిల్లలకు నేర్పడానికి నిజ జీవిత ఉదాహరణలను ఉపయోగించండి. ఉదాహరణకు, మీరు మీ పిల్లలకు బడ్జెటింగ్ గురించి బోధిస్తున్నట్లయితే, మీ కిరాణా జాబితా ధరలను ఎలా పోల్చి చూస్తారు, ఏ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవడాన్ని వారికి చూపవచ్చు.

బడ్జెట్ కేటాయింపులు.. మీ పిల్లల సహాయంతో కుటుంబ బడ్జెట్‌ను రూపొందించండి. ఫలితంగా వివేకవంతమైన డబ్బు నిర్వహణ ప్రాముఖ్యతను వారు బాగా అర్థం చేసుకుంటారు. అలాగే మీ పిల్లలకు భత్యం ఇవ్వడం, దానిని ఎలా ఖర్చు చేయాలి లేదా ఆదా చేయాలి అనే దాని గురించి వారి సొంత నిర్ణయాలు తీసుకునేలా చేయడం వలన వారు బడ్జెట్, పొదుపు ,డబ్బు విలువ గురించి తెలుసుకోవచ్చు.

ప్రాధాన్యతలను బోధించండి.. అవసరాలు, కోరికల మధ్య తేడాను గుర్తించడం పిల్లలకు నేర్పించాలి. అప్పుడు మీ పిల్లలకు వారి ఖర్చుల్లో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుంటారు. ఇది అధిక ఖర్చును నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే కుటుంబ పరమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు మీ పిల్లలతో కలిసి చర్చించి తీసుకోండి.

పొదుపు నేర్పండి.. మీ పిల్లలు వారి డబ్బులో కొంత భాగాన్ని ఆదా చేయడంలో వారికి సహాయపడండి. రోజూ మీరు ఇచ్చే డబ్బు నుంచే వారు నగదు దాచుకోవడం వంటివి నేర్పించాలి. అవసరమైతే ఓ పొదుపు ఖాతాను వారితో ఉమ్మడిగా ప్రారంభించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..