GST At Restaurants: రెస్టారెంట్లో బిల్‌పై జీఎస్టీ పడుతోందా? ఇలా చేస్తే కట్టాల్సిన అవసరం ఉండదు..

కిరాణా బిల్లుల నుంచి సినిమా టిక్కెట్ల నుంచి రెస్టారెంట్ లేదా హోటల్ ఆహార ఖర్చుల వరకు ప్రతిదీ జీఎస్టీకి లోబడే ఉంటుంది. ఈ పన్నును మనం నేరుగా ప్రభుత్వానికి చెల్లించకుండా వ్యాపారుల ద్వారా ప్రభుత్వానికి అందజేస్తున్నాం. అయితే దీనిని కొందరు వ్యాపారులు తమ అనుకూలంగా మర్చుకుంటున్నారు. జీఎస్టీ పరిధిలోకి రాని వాటికి జీఎస్టీ అంటూ అదనంగా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు.

GST At Restaurants: రెస్టారెంట్లో బిల్‌పై జీఎస్టీ పడుతోందా? ఇలా చేస్తే కట్టాల్సిన అవసరం ఉండదు..
Food At Restaurant

Updated on: Feb 20, 2024 | 8:22 AM

కేంద్ర ప్రభుత్వ తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటైతే.. వివిధ రకాలను ట్యాక్స్ ల స్థానంలో సింప్లిఫైడ్ ఫామ్ లో తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్(జీఎస్టీ) మరకొటి. 2017లో డీమానిటైజేషన్ చర్య గురించి దేశమంతా తీవ్రంగా చర్చించుకుంటున్న తరుణంలోనే జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది సేవల పన్ను, వ్యాట్, ఎక్సైజ్ సుంకంతో సహా అనేక ఇతర పరోక్ష పన్నులను భర్తీ చేసే సింగిల్ పరోక్ష పన్ను. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వస్తువులు, సేవలు పొందాలంటే అవి వస్తు, సేవా పన్ను (జీఎస్టీ)కి లోబడి ఉంటాయన్నమాట. కిరాణా బిల్లుల నుంచి సినిమా టిక్కెట్ల నుంచి రెస్టారెంట్ లేదా హోటల్ ఆహార ఖర్చుల వరకు ప్రతిదీ జీఎస్టీకి లోబడే ఉంటుంది. ఈ పన్నును మనం నేరుగా ప్రభుత్వానికి చెల్లించకుండా వ్యాపారుల ద్వారా ప్రభుత్వానికి అందజేస్తున్నాం. అయితే దీనిని కొందరు వ్యాపారులు తమ అనుకూలంగా మర్చుకుంటున్నారు. జీఎస్టీ పరిధిలోకి రాని వాటికి జీఎస్టీ అంటూ అదనంగా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో మనం ప్రతి సేవకు లేదా వస్తువును జీఎస్టీ పడుతుందా లేదా అన్నది తెలుసుకోవాలి. వాటిపై అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. అలాంటి వాటిల్లో రెస్టారెంట్లు ఒకటి. కొన్ని రెస్టారెంట్లు జీఎస్టీ పరిధిలోకి రావు. అలాంటి రెస్టారెంట్లను ఎలా గుర్తించాలి? తెలుసుకుందాం రండి..

జీఎస్టీ కాంపోజిషన్ స్కీమ్..

కొన్ని రెస్టారెంట్లకు ప్రభుత్వం జీఎస్టీ కాంపోజిషన్ స్కీమ్ ను అందిస్తుంది. ఈ స్కీమ్ ను సద్వినియోగం చేసుకునే రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి జీఎస్టీని వసూలు చేయకూడదు. కానీ వినియోగదారులకు సరైన అవగాహన లేని కారణంగా కొన్ని రెస్టారెంట్లు కూడా ఈ స్కీమ్ ని సద్దినియోగం చేసుకుంటూ కూడా వినియోగదారుల నుంచి జీఎస్టీని వసూలు చేస్తాయి.

జీఎస్టీ కాంపోజిషన్ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది..

వాస్తవానికి చిన్న వ్యాపారులపై పన్ను భారాన్ని తగ్గించేందుకు కాంపోజిషన్ స్కీమ్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాంపోజిషన్ స్కీమ్‌లను అనుసరించే వ్యాపారులు పన్ను ఇన్‌వాయిస్‌లను జారీ చేయలేరు. ఎందుకంటే వారి ఖాతాదారుల నుంచి పన్ను వసూలు చేసే హక్కు వారికి లేదు. బదులుగా, కాంపోజిషన్ వ్యాపారులు వారి స్వంత జేబుల నుంచి పన్ను చెల్లించాలి. ఇతర రాష్ట్రాలతో వ్యాపారం చేయని, రూ. 1.50 కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న పారిశ్రామికవేత్తలు జీఎస్టీ కాంపోజిషన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంపోజిషన్ స్కీమ్‌లో నమోదు చేసుకున్న తర్వాత, డీల్ రసీదులను అందించడం లేదా నెలవారీ రిటర్న్‌లను ఫైల్ చేయడం అవసరం లేదు. వస్తువుల లావాదేవీకి, కేవలం 1 శాతం పన్ను చెల్లించాలి. సేవలను అందించే వ్యాపారాలు 6% పన్ను, నాన్-ఆల్కహాల్ రెస్టారెంట్లను నిర్వహించే వ్యాపారాలు 5% పన్నుకు లోబడి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఎలా తెలుసుకోవచ్చంటే..

జీఎస్టీ కాంపోజిషన్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందే వారు తప్పనిసరిగా వారు ఇచ్చే బిల్లుపై ‘ఇక్కడి వస్తువులపై ఎటువంటి పన్ను విధించబడదు అని’ అని ముద్రించి ఉండాలి. మీరు దానిని మీ బిల్లులో కనుగొంటే, వారు మీ బిల్లుకు జీఎస్టీ ఛార్జీని జోడించలేరు. మీరు తిన్న రెస్టారెంట్ జీఎస్టీ కాంపోజిట్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందిందా లేదా అనే విషయాన్ని కూడా మీరు జీఎస్టీ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు ఈ విధంగా చేయండి.

మొదటిగా జీఎస్టీ పోర్టల్‌కి వెళ్లి.. ట్యాక్స్ పేయర్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత కాంపొజిషన్ ట్యాక్స్ పేయర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.  రెస్టారెంట్ బిల్లుపై రాసి ఉన్న జీఎస్టీ నంబర్ ను ఎంటర్ చేయండి. అప్పుడు మీకు ఆ రెస్టారెంట్ రెగ్యూలర్ జీఎస్టీ చెల్లిస్తుందా? లేక కాంపోజిట్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందుకుంటుందా అనేది తెలుస్తుంది. ఆ రెస్టారెంట్ కాంపోజిట్ చెల్లింపుదారు అయితే, బిల్లుకు జోడించిన జీఎస్టీ ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ రెస్టారెంట్ బిల్లులో జీఎస్టీని బలవంతంగా వసూలు చేసినట్లయితే, మీరు జీఎస్టీ పోర్టల్లోనే ఆన్‌లైన్‌లో ఫిర్యాదును సమర్పించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..