Low Speed E-Scooters: లో స్పీడ్ ఈ-స్కూటర్లకు డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ లైట్లు అవసరమా? దీని వెనుక అంత సైన్స్ ఉందా?

|

Jun 22, 2024 | 3:36 PM

లో స్పీడ్ స్కూటర్లకు ఈ ఫీచర్లు పెద్దగా అవసరం ఉండవు. హై కెపాసిటీ ఎల్ఈడీ లైట్లు, డిస్క్ బ్రేకులు ఉండాల్సిన అవసరం ఉండదు. కానీ చాలా లో స్పీడ్ స్కూటర్లు, మోపెడ్స్ మరి ముఖ్యంగా ఎలక్ట్రిక్ లో స్పీడ్ స్కూటర్లు డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ లైటింగ్ తో వస్తున్నాయి. పైగా ముందు వెనుక రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులతోనే వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? లో స్పీడ్ స్కూటర్ కి ఎల్ఈడీ లైటింగ్, డిస్క్ బ్రేకులు అసలు అవసరమా?

Low Speed E-Scooters: లో స్పీడ్ ఈ-స్కూటర్లకు డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ లైట్లు అవసరమా? దీని వెనుక అంత సైన్స్ ఉందా?
Okinawa Dual Low Speed Electric Scooter
Follow us on

సాధారణంగా హై స్పీడ్ బైక్స్ లేదా స్కూటర్లకు డిస్క్ బ్రేకులు అవసరం అవుతాయి. ఎమర్జెన్సీ స్టాపింగ్ కోసం ఉపయోగపడతాయి. అలాగే సౌండ్ లెస్ బ్రేకింగ్ ఈ డిస్క్ బ్రేకుల ద్వారానే సాధ్యమవుతుంది. అలాగే ఎల్ఈడీ లైటింగ్ కూడా టూవీలర్లకు ఇటీవల కాలంలో వస్తున్నాయి. లో స్పీడ్ స్కూటర్లకు ఈ ఫీచర్లు పెద్దగా అవసరం ఉండవు. హై కెపాసిటీ ఎల్ఈడీ లైట్లు, డిస్క్ బ్రేకులు ఉండాల్సిన అవసరం ఉండదు. కానీ చాలా లో స్పీడ్ స్కూటర్లు, మోపెడ్స్ మరి ముఖ్యంగా ఎలక్ట్రిక్ లో స్పీడ్ స్కూటర్లు డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ లైటింగ్ తో వస్తున్నాయి. పైగా ముందు వెనుక రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులతోనే వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? లో స్పీడ్ స్కూటర్ కి ఎల్ఈడీ లైటింగ్, డిస్క్ బ్రేకులు అసలు అవసరమా? అసలు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఎల్ఈడీ లైట్లతో ఒనగూరే ప్రయోజనం ఏమిటి? తెలుసుకుందాం రండి..

చాలా ఈ-స్కూటర్లలో..

ప్రపంచంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని తయారు చేసిన డీటెల్ వంటి సంస్థలు తమ ఉత్పత్తులకు ప్రత్యేకంగా లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ లైట్లను అమర్చుతున్నాయి. అలాగే గో గ్రీన్ బీఓవీ వంటి ఈవీ తయారీదారులు కూడా ఇదే వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. వాస్తవానికి డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థలు ఖర్చుతో కూడకున్నవి. వీటినిన లో స్పీడ్ స్కూటర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ అన్ని కంపెనీలు ఎందుకు వాటిని ఆయా స్కూటర్ మోడళ్లకు అందిస్తున్నాయి? ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..

ఎల్ఈడీ లైటింగ్ ఎందుకంటే..

ఎల్ఈడీ లైటింగ్ అనేది సాధారణ ఇన్ క్యాండిసెంట్ బల్బ్ కంటే మరింత సమర్థవంతమైనదని రుజువు అయింది. అంతేకాక ఎల్ఈడీ చాలా తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఎక్కువ ప్రకాశిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనంలో, ఎల్ఈడీలను ఉపయోగించడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గి.. దాని రేంజ్ పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈవీకి సాధారణంగా డీఆర్ఎల్ లు ఉండకపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే నిరంతరం ప్రకాశించే దీపం కలిగి ఉండటం వల్ల ఎక్కువ విద్యుత్ వినియోగం అవుతుంది. అందువల్ల ఎలక్ట్రిక్ టూ వీలర్ కి తప్పనిసరిగా ఎల్ఈడీ లైటింగ్ అనేది చాలా అవసరం.

డిస్క్ బ్రేకులు ఎందుకంటే..

డిస్క్ బ్రేక్‌ల విషయానికొస్తే, భద్రత ప్రధాన కారణంగా వీటిని అమర్చుతారు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనం ఎలాంటి శబ్ధం చేయదు. నిశ్శబ్ధంగా ప్రయాణం చేస్తుంది. ఇది ప్రమాదాలకు కారణమవుతుంది. మనం వస్తున్న సంగతి ఇతరులకు తెలుసుకునేందుకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఎవరైనా అడ్డుగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో డిస్క్ బ్రేకులు సమర్థవంతంగా పనిచేస్తాయి. సాంప్రదాయ డ్రమ్ బ్రేక్ కంటే డిస్క్ బ్రేక్ చాలా ఎక్కువ ఆపే శక్తిని కలిగి ఉంటుంది. ఈ కారణంగానే డిస్క్ బ్రేక్‌లు ఈవీలకు అమర్చుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..