Mother’s Day: అమ్మనూ సంరక్షిద్దాం.. మీ అమ్మ ప్రతి అవసరం తీర్చే బెస్ట్ ప్లాన్లు ఇవే..

|

May 14, 2023 | 11:50 AM

అమ్మకు వృద్ధాప్యం సమీపిస్తున్న కొలదీ అనేక ఆరోగ్య రుగ్మతలు చుట్టుముడుతుంటాయి. అటువంటి సమయంలో ఆమె ఆరోగ్యంతో పాటు వృద్ధాప్యంలో సుఖమయమైన జీవనాన్ని అందించడానికి కొంత ఆర్థిక ప్రణాళిక అసవరం. ఈ మథర్స్ డే రోజునే ఆమె గురించి ఆలోచించి మంచి బీమా పాలసీలు తీసుకుంటే ఆమెకు ఆరోగ్యంతో పాటు భద్రత ఉంటుంది.

Mothers Day: అమ్మనూ సంరక్షిద్దాం.. మీ అమ్మ ప్రతి అవసరం తీర్చే బెస్ట్ ప్లాన్లు ఇవే..
Mother's Day
Follow us on

సమాజంలో శ్రమ జీవి ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ మాత్రమే. ఎందుకంటే బయట తన వ‌ృత్తి జీవితంతో పాటు ఇంట్లో కూడా అన్ని చక్కబెడుతూ గృహ సీమనిపాలిస్తుంది. కుటుంబంలో ఎవరికీ ఏ లోటు రాకుండా ఒంటి చేత్తే అన్ని చక్కబెడుతుంది. పిల్లలకు అన్నీ తానై నడిపిస్తుంది. అది ఆమెకు కష్టమైనా ఎంతో ఇష్టంగా చేస్తుంటుంది. అటువంటి అమ్మ కష్టానికి వెలకట్టలేం. అయితే ఆమెకు వృద్ధాప్యం సమీపిస్తున్న కొలదీ అనేక ఆరోగ్య రుగ్మతలు చుట్టుముడుతుంటాయి. అటువంటి సమయంలో ఆమె ఆరోగ్యంతో పాటు వృద్ధాప్యంలో సుఖమయమైన జీవనాన్ని అందించడానికి కొంత ఆర్థిక ప్రణాళిక అసవరం. ఈ మథర్స్ డే రోజునే ఆమె గురించి ఆలోచించి మంచి బీమా పాలసీలు తీసుకుంటే ఆమెకు ఆరోగ్యంతో పాటు భద్రత ఉంటుంది. అలా అమ్మకు తీసుకోగదగిన బెస్ట్ ఇన్సురెన్స్ పాలసీలు ఏవి? చూద్దాం రండి..

హెల్త్ ఇన్సురెన్స్..

ప్రతి రోజూ ఉదయం లేచిన సమయం నుంచి కుటుంబానికి అన్నీ అందించేందుకు అమ్మ ఉరుకులు, పరుగులు పెడుతుంది. అటువంటి అమ్మ ఆరోగ్యానికి మనం అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణంగా ప్రతి మహిళ 35 నుంచి 55 ఏళ్ల మధ్య కొన్ని దీర్ఘకాలిక రోగాల బారిన పడతారు. ఆర్థరైటిస్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఆస్టోపోరోసిస్ వంటివి మగవారిలో కంటే ఆడవారిలో అధికంగా ఉంటాయి. వాటికి చికిత్స కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్యురెన్స్ బాగా ఉపయోగపడుతుంది. ఓపీడీ లేదా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఖర్చులతో పాటు డాక్డర్ కన్సల్టేషన్, టెలిమెడిసిన్ కన్సల్టేషన్, ఫార్మసీ బిల్స్, డయాగ్నోస్టిక్స్ వంటివి కవరయ్యే బెస్ట్ హెల్త్ ఇన్సురెన్స్ ప్లాన్ తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. అలాగే మహిళలకు కొన్ని ప్రత్యేకమైన హెల్త్ కేర్ అవసర కావొచ్చు అవి కూడా పాలసీలో వచ్చే విధంగా ఉండాలి.

టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్..

మీరు పాలసీ తీసుకొనే వ్యక్తి వర్కింగ్ ఉమెన్ అయినా లేక కేవలం గృహిణి మాత్రమే అయినా టెర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ తీసుకోవడం ఉత్తమం. వర్కింగ్ ఉమెన్ అయితే టర్మ్ ప్లాన్ అనేది మొత్తం ఫ్యామిలీ కవర్ అయ్యేలా ఉండాలి. అది మీ కుటుంబ ఆదాయాన్ని కాపాడుతుంది. అలాగే మీ కుటుంబంలో ఎవరికి ఏదైనా అనుకోని సంఘటన జరిగితే సంరక్షణగా ఉంటుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ దురదృష్టవశాత్తూ పాలసీ గడువు కన్నా ముందే చనిపోయినా.. వైకల్యం వచ్చినా, లేదా ఏదైనా ఊహించని రోగం చుట్టుముట్టినా టర్మ్ ప్లాన్లు బాగా ఉపకరిస్తాయి. అలాగే పిల్లల ఉన్నత చదువులకు కూడా ఇవి బాగా ఉపకరిస్తాయి. అలాగే ఈ టర్మ్ ఇన్సురెన్స్ పాలసీలు సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ మినహాయింపులు కూడా పొందుతాయి. అలాగే డెత్ క్లయిమ్ పై నామినీ కి వచ్చే మొత్తంపై కూడా సెక్షన్ 10(10డీ) కింద పన్ను రాయితీ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మోటార్ ఇన్సురెన్స్..

సాధారణంగా ప్రతి కారు ఓనర్లకు థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ అనేది మన దేశంలో తప్పనిసరి. దానికి అదనంగా కాంప్రిహెన్సివ్ మోటార్ ఇన్యురెన్స్ కూడా తీసుకోవడం మంచిది. ఒకవేళ మీ అమ్మ ఎక్కువగా డ్రైవ్ చేయకపోతే పే యాజ్ యూ డ్రైవ్(పేఏవైడీ) మోటార్ ఇన్సురెన్స్ ని ఎంపిక చేసుకోవచ్చు.

యూనిట్ లింక్ డ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్(యూఎల్ఐపీ)..

యూఎల్ఐపీ అంటే బీమాతో కూడిన ఇన్వెస్ట్మెంట్. దీని ద్వారా మీ డిపెండెంట్స్ కు జీవిత బీమా వస్తుంది. ఒక వేళ మీరు ఇటీవలే తల్లి అయితే మీ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు అప్పుడు అంటే ఓ 20 ఏళ్ల తర్వాత ఈ స్కీమ్ మీకు ఉపయోగపడుతుంది. ఈ యూఎల్ఐపీ ల్లో కనీసం 12 నుంచ 15శాతం రాబడి వస్తుంది.

గ్యారంటీ రిటర్న్ ప్లాన్..

ఈ ప్లాన్‌లు 7.5% వరకు గ్యారెంటీ రాబడిని అందిస్తాయి. పూర్తిగా పన్ను రహితం. అంతేకాకుండా, బీమా చేసిన వ్యక్తి ఆకస్మికంగా మరణించిన సందర్భంలో మీపై ఆధారపడిన వారిని రక్షించేందుకు ఈ ప్లాన్‌లు జీవిత బీమా కవరేజీని అందిస్తాయి. మీరు సుమారు 45 సంవత్సరాల వరకు వడ్డీ రేటును లాక్ చేయవచ్చు. ఈ ప్లాన్‌లు కూడా వార్షిక ప్రీమియంలో రూ. 5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను అందిస్తాయి.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..