SCSS: వృద్ధులకు అలర్ట్.. ఎస్సీఎస్ఎస్ పథకంలో లాభాలే కాదు.. ఇబ్బందులూ ఉన్నాయ్.. వివరాలు ఇవి..

ఎస్సీఎస్ఎస్ పథకం వల్ల అధిక ప్రయోజనాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. దీనిలో పెట్టుబడి పెట్టే ముందు వృద్ధులు కొన్ని విషయాలపై అవగాహన అవసరం. చేయదగని పనులు, చేయకూడని పనులపై క్లారిటీ ఉండాలి. వాటిని మైండ్లో పెట్టుకొని ఎస్సీఎస్ఎస్ పథకంలో పెట్టుబడి పెట్టాలి.

SCSS: వృద్ధులకు అలర్ట్.. ఎస్సీఎస్ఎస్ పథకంలో లాభాలే కాదు.. ఇబ్బందులూ ఉన్నాయ్.. వివరాలు ఇవి..
Senior Citizen Saving Schem

Updated on: May 12, 2023 | 3:10 PM

వయసు మీరిన తర్వాత పని చేయడం కష్టం. అందుకనే వృద్ధులకు ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడతాయి. వాటిల్లో ప్రధానమైనది సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్). ప్రభుత్వ భరోసా ఉండే ఈ స్కీమ్ లో 60 ఏళ్లు పై బడిన ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఐదేళ్ల కాల వ్యవధితో పెట్టుబడి పెడితే 8.2శాతం వార్షిక వడ్డీ రేటు పొందవచ్చు. ఈ పథకం స్థిరమైన వడ్డీ రేటుతో కచ్చితమైన రాబడులను ఇస్తుంది. వృద్ధులకు ఎప్పటినుంచో గొప్ప భరోసా, భద్రత ఈ పథకం ద్వారా లభిస్తోంది. అయితే ఈ పథకం వల్ల అధిక ప్రయోజనాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. దీనిలో పెట్టుబడి పెట్టే ముందు వృద్ధులు కొన్ని విషయాలపై అవగాహన అవసరం. చేయదగని పనులు, చేయకూడని పనులపై క్లారిటీ ఉండాలి. వాటిని మైండ్లో పెట్టుకొని ఎస్సీఎస్ఎస్ పథకంలో పెట్టుబడి పెట్టాలి. ఈ నేపథ్యంలో అసలు ఈ పథకం ప్రయోజనాలు ఏంటి? ఇబ్బందులు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎస్సీఎస్ఎస్ పథకం ప్రయోజనాలు ఇవి..

పన్ను ప్రయోజనాలు.. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వారికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినిహాయింపును పొందుతారు. రూ. 1.5లక్షల వరకూ పన్ను మినహాయింపును పెట్టుబడిదారులు క్లయిమ్ చేసుకోవచ్చు.

అధిక భద్రత.. ఈ ఎస్సీఎస్ఎస్ పథకం ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది కాబట్టి దీనిలో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితం. దీనిలో డీఫాల్ట్ కావడానికి, లేదా మీ పెట్టుబడి నష్టపోవడానికి చాలా తక్కువ అవకాశాలున్నాయి. అందుకే సీనియర్ సిటిజెనులు ఎటువంటి భయం లేకుండా రూ. 30లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

ముందస్తు ఉపసంహరణలకు అవకాశం.. పెట్టుబడి దారులు డిపాజిట్ చేసిన మొత్తాన్ని నిర్ణీత కాల వ్యవధికన్నా ముందే విత్ డ్రా చేసుకోవచ్చు. ఖాతా ప్రారంభించిన ఏడాది తర్వాత విత్ డ్రా చేస్తే వడ్డీ వస్తుంది. ఎటువంటి పెనాల్టీ ఉండదు. కానీ ఏడాది లోపు కనుక విత్ డ్రా చేస్తే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై ఎటువంటి వడ్డీ ఇవ్వరు. మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అంతా వెనక్కి ఇస్తారు.

ఖాతా బదిలీ చేసుకోవచ్చు.. పెట్టుబడి దారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వారైతే వారి ఎస్సీఎస్ఎస్ ఖాతాను ఆ ప్రాంతానికి సులభంగా బదిలీ చేసుకోవచ్చు. బ్యాంకు, పోస్ట్ ఆఫీసుల్లో దేనికైన మార్చుకోవచ్చు.

ఎస్సీఎస్ఎస్ పథకంలో ఇబ్బందులు..

వచ్చిన వడ్డీపై వడ్డీ ఉండదు.. ఈ ఎస్సీఎస్ఎస్ స్కీమ్ లో ప్రతి క్వార్టర్ కి వడ్డీని జమ చేస్తారు. ఒక క్వార్టర్ లో వచ్చిన వడ్డీని మీరు క్లయిమ్ చేసుకోకున్నా దాని పై ఎటువంటి వడ్డీ రాదు. డిపాజిట్ చేసిన అసలుపై మాత్రమే వడ్డీ వస్తుంది. ఒక క్వార్టర్ లో జమైన వడ్డీ అలాగే ఉండిపోతుంది. దానికి అదనంగా ఎటువంటి వడ్డీ చెల్లించరు.

టీడీఎస్.. ఈ పథకంలో పెట్టుబడికి ఏడాదిలో వచ్చిన వడ్డీ రూ. 50,000 కన్నా ఎక్కువ ఉంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్(టీడీఎస్) కట్ అవుతుంది.

స్థిరమైన వడ్డీ రేటు.. ఈ పథకంలో వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. ఒకవేళ మనం ఖాతా ప్రారంభించిన రోజుల వ్యవధిలో వడ్డీ రేటు పెంచినా అది ఖాతాదారులకు అందదు. ఖాతా ప్రారంభంలో ఎంత వడ్డీ అయితే ఉందో అంతే వడ్డీ రేటు వస్తుంది. అయితే పాత ఖాతా నిలిపివేసి, కొత్త వడ్డీ రేటు ప్రకారం ఖాతా ప్రారంభించవచ్చు. కానీ దానికి కొన్ని చార్జీలు వర్తిస్తాయి.

వయో పరిమితి.. ఈ పథకంలో కేవలం 60ఏళ్లు పైబడిన వారు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అర్హులు. డిఫెన్స్ ఉద్యోగులు అయితే 50 నుంచి 60 ఏళ్ల వారు, సివిలియన్ ఎంప్లాయీ లైతే 55 నుంచి 60 ఏళ్ల వారు పెట్టుబడి పెట్టొచ్చు. 30, 40 ఏళ్లలో వాలంటరరీ రిటైర్మెంట్ తీసుకున్న వారు ఈ పథక ప్రయోజనాలు పొందలేరు.

మొత్తం మీద ఎస్సీఎస్ఎస్ పథకం సీనియర్ సిటిజెన్స్ ప్రయోజనకరమే. కానీ ట్యాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తున్నాయా లేదా అని తెలుసుకోవాలి. నిబంధనల మీద అవగాహనకు వచ్చాక ఖాతాను ప్రారంభించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..