HDFC Swiggy Credit Card: స్విగ్గీతో జతకట్టిన హెచ్‌డీఎఫ్‌సీ.. క్యాష్‌ బ్యాక్‌ క్రెడిట్‌ కార్డుల్లో ఇదే బంపర్‌ ఆఫర్‌..

|

Aug 27, 2023 | 12:15 PM

ఈ తాజా కార్డులతో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, డైనౌట్‌, స్విగ్గీ జెనీ ద్వారా ఆహార ఆర్డర్‌లు, కొనుగోళ్లతో సహా స్విగ్గీ యాప్‌లోని వివిధ లావాదేవీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. కాబట్టి, కార్డ్ హోల్డర్‌లు ఆహారాన్ని ఆర్డర్ చేసిన ప్రతిసారీ, కిరాణా సామగ్రిని పొందినప్పుడు లేదా ఫార్మ్‌ఈజీ, నెట్‌ మెడ్స్‌, బుక్‌ మై షో వంటి బహుళ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఖర్చు చేయడంపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు.

HDFC Swiggy Credit Card: స్విగ్గీతో జతకట్టిన హెచ్‌డీఎఫ్‌సీ.. క్యాష్‌ బ్యాక్‌ క్రెడిట్‌ కార్డుల్లో ఇదే బంపర్‌ ఆఫర్‌..
Hdfc Swiggy Card
Follow us on

క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లకు పెరుగుతున్న ప్రజాదరణను క్యాష్ చేసుకోవడానికి మరో కొత్త బ్యాంక్‌ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ రంగంలోకి దిగింది.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ స్విగ్గీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను లాంచ్ చేయడానికి దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ మరియు గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన స్విగ్గితో చేతులు కలిపింది. ఈ తాజా కార్డులతో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, డైనౌట్‌, స్విగ్గీ జెనీ ద్వారా ఆహార ఆర్డర్‌లు, కొనుగోళ్లతో సహా స్విగ్గీ యాప్‌లోని వివిధ లావాదేవీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. కాబట్టి, కార్డ్ హోల్డర్‌లు ఆహారాన్ని ఆర్డర్ చేసిన ప్రతిసారీ, కిరాణా సామగ్రిని పొందినప్పుడు లేదా ఫార్మ్‌ఈజీ, నెట్‌ మెడ్స్‌, బుక్‌ మై షో వంటి బహుళ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఖర్చు చేయడంపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇంకా ఇతర ఇతర ఆన్‌లైన్ ఖర్చులపై 1 శాతం క్యాష్‌బ్యాక్ ఉంటుంది. కాబట్టి ఈ కార్డుపై ఇతర వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

10 శాతంతో ప్రత్యేక ఆదరణ

ఈ క్యాష్‌ బ్యాక్‌ క్రెడిట్‌ కార్డు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులతో పోల్చినప్పుడు ఈ కార్డుపై చాలా ఆకర్షణీయ ఆఫర్స్‌ ఉన్నాయని తెలుస్తోంది. ఈ కార్డు ద్వారా ఫుడ్ ఆర్డర్‌లు, గ్రోసరీ డెలివరీ, డైనింగ్ అవుట్ బిల్లులపై 10 శాతం అధిక క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది, మిగిలిన రెండు కార్డ్‌లు తమ భాగస్వామి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై ఖర్చుపై గరిష్టంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తాయి. అంతేకాకుండా స్వీగ్గీ-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వివిధ రకాల ప్రముఖ బ్రాండ్‌లపై ఖర్చు చేసినందుకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ వంటి ఇతర క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లపై సాధారణంగా అనేక బ్రాండ్‌లు అందించే క్యాష్‌బ్యాక్ కంటే ఇది ఎక్కువ. 

ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్స్‌ చేసే వారికి ప్రత్యేకం

స్విగ్గీ-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రతి నెలా స్విగ్గీ ద్వారా గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్డు ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌ స్విగ్గీ యాప్‌లో ఖర్చులపై మాత్రమే వస్తుంది. ఆహారం లేదా కిరాణాని ఆర్డర్ చేయడం లేదా డైన్‌అవుట్ ద్వారా తినడం, లేదా చెల్లించడం వంటి వాటి ద్వారా ఈ క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అంతేకాకుండా స్వాగత ప్రయోజనంగా కార్డ్ హోల్డర్లు మూడు నెలల పాటు రూ. 1,199 విలువైన స్విగ్గీ వన్ సభ్యత్వాన్ని పొందుతారు. స్విగ్గీ వన్‌ ప్రోగ్రామ్ కింద కార్డ్ హోల్డర్‌లు రూ.149 కంటే ఎక్కువ ఆర్డర్‌లపై ఎంపిక చేసిన రెస్టారెంట్‌ల నుంచి ఉచిత ఫుడ్ డెలివరీని పొందుతారు.

ఇవి కూడా చదవండి

స్విగ్గీ మనీ రూపంలోనే..

కార్డు హోల్డర్‌లు స్విగ్గీ మనీ రూపంలో క్యాష్‌బ్యాక్‌ను పొందుతారు. అది యాప్ ద్వారా వివిధ ఖర్చులకు ఉపయోగపడుతుంది. అంటే సంపాదించిన క్యాష్‌బ్యాక్‌ను స్విగ్గీ యాప్ ద్వారా మాత్రమే ఖర్చు చేయవచ్చు. ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో చేసిన కొనుగోళ్లకు ఉపయోగించడానికి కుదరదు. 

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం