RD Interest Rate: రికరింగ్‌ డిపాజిట్‌తో ఆకర్షణీమైన వడ్డీ.. నెలవారీ పొదుపు చేసే వారికి అద్భుతమైన పన్ను ప్రయోజనాలు

పెట్టుబడికి భరోసాతో పాటు నమ్మకమైన రాబడితో ఈ పథకాలు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే సాధారణంగా ఆర్‌డీలను చాలా మంది పోస్టాఫీసుల్లోనే కట్టడానికి మక్కువ చూపుతారు. ప్రతి గ్రామంలో కచ్చితంగా పోస్టాఫీసు ఉంటుంది కాబట్టి ప్రీమియం చెల్లించడానికి సౌకర్యంగా ఉంటుందని అందరూ పోస్టాఫీసుల్లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. అయితే బ్యాంకింగ్‌ రంగంలో కూడా టెక్నాలజీ పెరగడంతో పాటు ఖాతాదారులను ఆకట్టుకోవడానికి ఎస్‌బీఐ వంటి బ్యాంకులు అత్యధిక శాఖలతో ప్రజలకు సేవలను అందిస్తున్నాయి.

RD Interest Rate: రికరింగ్‌ డిపాజిట్‌తో ఆకర్షణీమైన వడ్డీ.. నెలవారీ పొదుపు చేసే వారికి అద్భుతమైన పన్ను ప్రయోజనాలు
Fixed Deposit
Follow us
Srinu

|

Updated on: Aug 27, 2023 | 11:30 AM

జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును నమ్మకమైన రాబడి కోసం కొన్ని పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. అయితే వేతన జీవులు ఎక్కువగా ఉన్న భారతదేశంలో నెలవారీ పొదుపు పథకాల్లో పెట్టుబడికి ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని ఆకట్టుకోవడానికి అన్ని బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల వంటి సంస్థలు రికరింగ్‌ డిపాజిట్లల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయి. పెట్టుబడికి భరోసాతో పాటు నమ్మకమైన రాబడితో ఈ పథకాలు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే సాధారణంగా ఆర్‌డీలను చాలా మంది పోస్టాఫీసుల్లోనే కట్టడానికి మక్కువ చూపుతారు. ప్రతి గ్రామంలో కచ్చితంగా పోస్టాఫీసు ఉంటుంది కాబట్టి ప్రీమియం చెల్లించడానికి సౌకర్యంగా ఉంటుందని అందరూ పోస్టాఫీసుల్లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. అయితే బ్యాంకింగ్‌ రంగంలో కూడా టెక్నాలజీ పెరగడంతో పాటు ఖాతాదారులను ఆకట్టుకోవడానికి ఎస్‌బీఐ వంటి బ్యాంకులు అత్యధిక శాఖలతో ప్రజలకు సేవలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి పోస్టాఫీసు అనువైనదా? ఎస్‌బీఐ అనువైనదా? అనే అంశం అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఈ రెండింటిల్లో ఏయే పథకంలో ఎంత మేర వడ్డీ వస్తుంది? అనే అంశాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్లు

ఎస్‌బీఐ ఒక సంవత్సరం నుంచి పదేళ్ల కాలవ్యవధి వరకు రికరింగ్ డిపాజిట్లను అనుమతిస్తుంది. ఆ తర్వాత ప్రతి నెలా రూ.100 కనిష్ట డిపాజిట్ అవసరం దాన్ని రూ.10 గుణిజాల్లో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్‌బీఐ సాధారణ ప్రజలకు 6.5 శాతం నుంచి 7 శాతం పరిధిలో రికరింగ్ డిపాజిట్లపై వడ్డీని అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 7 శాతం నుంచి 7.5 శాతం వరకూ వడ్డీని అందిస్తుంది. ఈ తాజా రేట్లు 15 ఫిబ్రవరి 2023 నుంచి అమల్లోకి వస్తాయి. 

ఎస్‌బీఐ ఆర్‌డీ తాజా వడ్డీ రేట్లు

  • 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.80 శాతం (సాధారణం) 7.30 శాతం(సీనియర్ సిటిజన్లు)
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ 7 శాతం (సాధారణ) 7.50 శాతం (సీనియర్ సిటిజన్లు)
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ 6.50 (సాధారణ) 7.00 (సీనియర్ సిటిజన్లు)
  • 5 సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు 6.50 (జనరల్) 7.50 (సీనియర్ సిటిజన్లు)
  • పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లు 
  • పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ కాలవ్యవధితో వస్తుంది. కనీసం రూ.100 నెలవారీ సహకారం లేదా గరిష్ట పరిమితి లేకుండా రూ.10 గుణకాలలో ఏదైనా మొత్తంగా డిపాజిట్‌ చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ పథకం సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేటు ప్రయోజనాలను అందించదు. ఈ రేట్లు 1 జూలై 2023 నుంచి అమలులోకి వస్తాయి.
  • పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ తాజా వడ్డీ రేట్లు
  • ఐదు సంవత్సరాల ఆర్‌డీ 6.5 శాతం

ఆర్‌డీ పన్ను నియమాలు

రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌) వర్తిస్తుంది. సంపాదించిన ఆర్‌డీ వడ్డీ రేట్లపై 10 శాతం టీడీఎస్‌ వర్తిస్తుంది. రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ.10,000 కంటే ఎక్కువ ఉంటే టీడీఎస్‌ తీసేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!