HDFC బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌! నిలిచిపోనున్న UPI సేవలు!

HDFC Bank మే 23న అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 4 గంటల వరకు సిస్టమ్ నిర్వహణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో HDFC ఖాతాలకు సంబంధించిన UPI సేవలు, అలాగే గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం వంటి యాప్‌లలో @okhdfcbank హ్యాండిల్ ద్వారా జరిగే చెల్లింపులు అందుబాటులో ఉండవని తెలిపింది.

HDFC బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌! నిలిచిపోనున్న UPI సేవలు!
Hdfc Bank

Updated on: May 22, 2026 | 7:18 AM

HDFC బ్యాంక్‌ తన ఖాతాదారులకు కీలక సమాచారం అందించింది. బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరచేందుకు మే 23, 2026న అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 4 గంటల వరకు సిస్టమ్ మేయిటెనెన్స్‌ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్వహణ కారణంగా మూడు గంటల పాటు కొన్ని UPI సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ప్రకటన ప్రకారం ఈ సమయంలో HDFC బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన అన్ని UPI లావాదేవీలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి.

అలాగే గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్‌లలో HDFC UPI హ్యాండిల్స్‌ (@okhdfcbank) ద్వారా చేసే చెల్లింపులు కూడా పనిచేయవని స్పష్టం చేసింది. అయితే ఈ నిర్వహణ సమయంలో Zapp ఖాతాలను ఉపయోగించి లావాదేవీలు కొనసాగించవచ్చని బ్యాంక్ పేర్కొంది. గతంలో PayZapp Walletగా ఉన్న ఈ సేవ ప్రస్తుతం Zapp పేరుతో అందుబాటులో ఉంది.

సిస్టమ్ అప్‌గ్రేడ్‌ల ద్వారా సేవల సామర్థ్యాన్ని, భద్రతను మెరుగుపరచడమే ఈ నిర్వహణ లక్ష్యమని బ్యాంక్ తెలిపింది. ఖాతాదారులు ముందుగానే తమ అవసరమైన UPI లావాదేవీలు పూర్తి చేసుకోవాలని సూచించింది. ఇటీవల డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు తమ సర్వర్ సామర్థ్యాన్ని, సైబర్ భద్రతా వ్యవస్థలను నిరంతరం అప్‌డేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో నిర్వహణ పనుల కోసం కొన్నిసార్లు తాత్కాలిక సేవల అంతరాయం తప్పనిసరి అవుతోందని నిపుణులు చెబుతున్నారు. కస్టమర్ల సహకారానికి ధన్యవాదాలు తెలిపిన HDFC బ్యాంక్, మెరుగైన బ్యాంకింగ్ అనుభవం కోసం ఈ నిర్వహణ చేపడుతున్నామని పేర్కొంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us