
HDFC Bank Alert: సాధారణంగా బ్యాంకుల సేవల్లో అప్పుడప్పుడు అంతరాయం కలుగుతుంటుంది. ఎందుకంటే సిస్టమ్ అప్‌గ్రేడ్ కారణంగా కొన్ని గంటల పాటు పలు రకాల బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వినియోగదారులను అలర్ట్ చేసింది. బ్యాంకు సేవల్లో అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఈ అంతరాయాలు సాధారణంగా షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా వస్తాయి. దీని గురించి బ్యాంక్ ముందుగానే కస్టమర్‌లకు SMS లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేస్తుంది. అందుకే మీ బ్యాంక్ సందేశాలను గమనించడం ముఖ్యం.
ఈ సేవలు జనవరి 11వ తేదీన తెల్లవారు జామున 12.00 గంటల నుంచి ఉదయం 2 గంటల (అర్థరాత్రి) వరకు మొత్తం 2 గంటల పాటు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. ఈ సమయంలో HDFC బ్యాంక్ యాప్‌కు సంబంధించిన సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ సమయంలో వాట్సాప్ ద్వారా నెట్‌బ్యాంకింగ్ సేవలు, PayZapp, చాట్‌బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. బ్యాంకు సిస్టమ్స్ నిర్వహణలో భాగంగా ఈ రెండు గంటల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
ఇది కూడా చదవండి: Indian Railways: సంవత్సరాలుగా రైలు ప్రయాణం చేసే వారికి కూడా ఈ విషయాలు తెలియకపోవచ్చు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మెయింటెన్స్ పనులతో తమ బ్యాంక్ సేవల్లో ఏర్పడుతున్న అంతరాయాన్ని అర్థం చేసుకోవాలని, దీనిని వినియోగదారులు సహకరించాలని కోరింది. వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం, విశ్వసనీయతను మెరుగుపరచడం, సున్నితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా మెయింటెనెన్స్ చేపడుతున్నట్లు బ్యాంక్ తెలిపింది.
Hdfc
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి