
ఆధార్‌తో పాన్ అనుసంధానానికి సమయం ముగిసింది. పలు దఫాలుగా గడువు పొడిగిస్తూ వచ్చిన ప్రభుత్వం అపరాధం రుసుంతో 2023 జూన్ 30 వరకూ ఇచ్చిన సమయం అయిపోయింది. ఒకవేళ ఇప్పటికీ ఆధార్ పాన్ కార్డులను లింక్ చేయకపోతే ఆర్థిక లావాదేవీలు, ఆదాయ పన్నులు చెల్లింపుదారులకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఆధార్, పాన్ కార్డులను లింక్ చేయని వారి పాన్ కార్డు నిలిచిపోయింది. దానిపై ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయలేరు. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లో పెట్టుబడులు పెట్టిన వారుమరింతగా ఇబ్బంది పడతారు. పాన్ పనిచేయదు కాబట్టి మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి వ్యతిరేకంగా ఫారమ్ 15 జీ/హెచ్ సమర్పించడానికి మీరు అనుమతి ఉండదు. అలాగే నగదుపై టీడీఎస్ 10శాతానికి బదులుగా 20శాతం డిడక్ట్ అవుతుంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్ సైట్లో పొందుపరిచింది. ‘పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, అటువంటి పాన్ కార్డు 1 జూలై 2023 నుంచి పనిచేయడం లేదు. దీంతో ఫిక్స్ డ్ డిపాజిట్ కలిగిన వినియోగదారులు ఫారమ్ 15 జి/హెచ్‌ని సమర్పించడానికి అనుమతి ఉండదు. అంతేకాక పనిచేయని పాన్‌లకు అధిక టీడీఎస్ కట్ అవుతుంది’ అని పేర్కొంది. అంటే మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఒక ఆర్థిక సంవత్సరంలో సాధారణ పౌరులకు అయితే రూ. 40,000, అదే సినీయర్ సిటిజెన్స్‌కు అయితే రూ. 50,000 కంటే ఎక్కువ వడ్డీని సంపాదిస్తే, మీరు ఆ ఎఫ్‌డీ పెట్టుబడులపై టీడీఎస్ వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారం, జూలై 1, 2017 నాటికి పాన్, ఆధార్ నంబర్ లింక్ చేయడాన్ని తప్పనిసరి చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..