Harbhajan Singh: రూ.17.58 కోట్లకు అపార్ట్‌మెంట్‎ను అమ్మిన హర్భజన్ సింగ్.. నాలుగేళ్లలో మూడు కోట్ల లాభం..

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ముంబైలోని ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను రూ. 17.58 కోట్లకు విక్రయించినట్లు Zapkey.com యాక్సెస్ చేసిన పత్రాలు తెలుపుతున్నాయి. కొనుగోలుదారు JBC ఇంటర్నేషనల్ LLP అని వారు తెలిపారు...

Harbhajan Singh: రూ.17.58 కోట్లకు అపార్ట్‌మెంట్‎ను అమ్మిన హర్భజన్ సింగ్.. నాలుగేళ్లలో మూడు కోట్ల లాభం..
Harbajn Sing

Updated on: Nov 24, 2021 | 11:43 AM

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ముంబైలోని ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను రూ. 17.58 కోట్లకు విక్రయించినట్లు Zapkey.com యాక్సెస్ చేసిన పత్రాలు తెలుపుతున్నాయి. కొనుగోలుదారు JBC ఇంటర్నేషనల్ LLP అని వారు తెలిపారు. సేల్ డీడ్ నవంబర్ 18, 2021న రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిసింది. ఈ అపార్ట్‌మెంట్ 2,830 చదరపు అడుగుల కార్పెట్ ప్రాంతంలో విస్తరించి ఉంది.

అంధేరీ వెస్ట్‌లోని రుస్తోమ్‌జీ ఎలిమెంట్స్ ప్రాజెక్ట్ తొమ్మిదవ అంతస్తులో ఈ ఖరీదైన అపార్ట్‌మెంట్‌ ఉంది. కొనుగోలుదారుడు రూ.87.9 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు పత్రాల్లో ఉంది. హర్భజన్ సింగ్ డిసెంబర్ 2017లో ఆస్తిని కొనుగోలు చేసి, 2018 మార్చిలో రూ.14.5 కోట్లకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దాదాపు నాలుగేళ్లలో మూడు కోట్ల లాభం పొందాడు ఈ టర్బోనేటర్. ఈ డీల్‎కు సంబంధంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also… Best Captain: ఆ ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు.. సల్మాన్ బట్ ఏం సమాధానం చెప్పాడు..