Joy e-bike Subsidy: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరుగుతోంది. ప్రభుత్వాలు ఈ వాహనాల తయారీకి ఊతమిచ్చే క్రమంలో రాయితీలు ప్రకటిస్తున్నాయి. ఇక ఒకప్పుడు కేవలం… కొన్ని కంపెనీలు మాత్రమే ఈ వాహనాలను తయారు చేసేవి. కానీ.. ప్రస్తుతం దాదాపు అన్ని టాప్ ఆటో మొబైల్ కంపెనీలు ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ రంగంలోకి దిగాయి. దీంతో ఈ వెహికిల్స్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఇక ప్రభుత్వాలు సైతం ప్రజల్లో విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే సబ్సిడీలు అందిస్తున్నాయి.
తాజాగా గుజరాత్ ప్రభుత్వం విద్యార్థుల కోసం బంపరాఫర్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే క్రమంలో రాయితీలను ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా జాయ్ ఈ-బైక్‌పై సబ్సిడీకి గుజరాత్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (జీఈడీఏ) ఆమోదం తెలిపింది. ఈ బైక్‌లో గుజరాత్ ప్రభుత్వం ఏకంగా రూ. 12 వేల సబ్సిడీని అందిస్తోంది. అంటే ఎక్స్ షో రూమ్ ధరతో పోలిస్తే రూ. 12 వేలు తక్కువకు అందుబాటులో ఉండనున్నాయన్నమాట. అయితే ప్రస్తుతం ఈ అవకాశాన్ని తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు మాత్రమే అందించనుంది. ఇక ఈ బైక్ ఫీచర్స్ విషయానికొస్తే.. బ్యాటరీ టైప్- 74 V, 25Ah/30Ah, లిథియం అయాన్ బ్యాటరీ అందిస్తోంది. ఈ బండి అత్యధికంగా గంటకు 25 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బైక్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఫుల్ ఛార్జింగ్ చేయడానికి నాలుగు నుంచి నాలుగున్నర గంటలు పడుతుంది.
Also Read: Post Office Best Sceme: ప్రతి నెలా రూ.1000 డిపాజిట్ చేయండి.. ఆ తర్వాత రూ. 6 లక్షలు తీసుకోండి..
ICICI Bank Alert: ఐసీఐసీఐ అలర్ట్.. ఆగస్టు నుంచి మారనున్న సర్వీస్ ఛార్జీలు.. వివరాలు..