
జీఎస్టీ వసూళ్లు పుంజుకున్నాయి. జనవరి నెలలో దాదాపు రూ.1.20 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీమొత్తంలో వసూలు అవ్వడం ఇదే తొలిసారి. జనవరి 31 వరకు (సాయంత్రం 6 గంటల వరకు) మొత్తం రూ.1,19,847 కోట్లు కోట్లు వసూలైనట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో సీజీఎస్టీ కింద రూ.21,923 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.29,014 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.60,288 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. సెస్సుల రూపంలో రూ.8,622 కోట్లు సమకూరినట్లు పేర్కొంది. డిసెంబర్ నెలకు సంబంధించి జనవరి 31 వరకు 90 లక్షల జీఎస్టీఆర్-2బీ రిటర్నులు దాఖలైనట్లు పేర్కొంది. ఇప్పటి వరకు గత నెల వసూలైన రూ.1.15 లక్షల కోట్లే రికార్డు కాగా.. 2021 జనవరి నెలలో రూ.1,19,847 లక్షల కోట్ల వసూలుతో పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.