AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jan Aushadhi Outlets: జనఔషధి మందులపై పెరుగుతున్న నమ్మకం.. ఏకంగా వెయ్యి కోట్ల మేర అమ్మకాలు

ప్రస్తుత రోజుల్లో మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా ప్రజలు వివిధ రోగాలబారిన పడడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా కరోనా వంటి మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన విలయం ఎవరూ మర్చిపోలేరు. అయితే ఎంతంటి రోగమైన వైద్యం చేయించుకోవడం అనేది తప్పదు. ఇలాంటి సందర్భంలో ప్రజలకు పెరుగుతున్న మందుల ధరల నుంచి ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకు మందులు లభించేలా జనఔషధి షాపులను అందుబాటులోకి తెచ్చింది.

Jan Aushadhi Outlets: జనఔషధి మందులపై పెరుగుతున్న నమ్మకం.. ఏకంగా వెయ్యి కోట్ల మేర అమ్మకాలు
Jan Aushadhi Outlets
Nikhil
|

Updated on: Oct 22, 2024 | 1:18 PM

Share

మొదట్లో జనఔషధి స్టోర్స్‌పై ప్రజల నుంచి పెద్దగా ఆదరణ లేకపోయినా క్రమేపి జనఔషధి స్టోర్స్‌పై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. జన్ ఔషధి అవుట్‌లెట్‌ల విక్రయాలు ఈ ఏడాది అక్టోబర్‌లో రూ. 1,000 కోట్ల మార్కుకు చేరుకున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా, ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2024 ఒక్క నెలలో రూ. 200 కోట్ల విలువైన మందులను విక్రయించిందంటే ప్రజలకు ఈ స్టోర్స్ ఎంతలా సర్వీస్ అందిస్తున్నాయో? అర్థం చేసుకోవచ్చు. నాణ్యమైన మందులపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఈ అమ్మకాలు దిక్సూచిగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

దేశవ్యాప్తంగా 14,000 కంటే ఎక్కువ జన ఔషధి కేంద్రాల నుంచి ప్రజలు  ఔషధాలను కొనుగోలు చేయడం ద్వారా ఈ స్థాయి అమ్మకాలు సాధ్యమయ్యాయని కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా మందులపై ప్రజలు పెట్టే ఖర్చును తగ్గించడం ద్వారా అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తీసుకురావడానికి పీఎంబీఐ చూపుతున్న నిబద్ధతకు గణనీయమైన వృద్ధి నిదర్శనమని పేర్కొంది. 

గత 10 సంవత్సరాల్లో దేశంలో జన్ ఔషధి అవుట్‌లెట్ల సంఖ్య దాదాపు 170 రెట్లు పెరిగింది. 2014లో కేవలం 80 అవుట్‌లెట్‌లు ఉండగా ఇప్పుడు దేశంలోని దాదాపు అన్ని జిల్లాలను కవర్ చేస్తూ 14,000 అవుట్‌లెట్‌లకు పైగా పెరిగాయి. రాబోయే రెండేళ్లలో దేశంలో దాదాపు 25,000 జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పీఎంబీజేపీ)కి సంబంధించిన ఉత్పత్తుల్లో 2,047 మందులు, 300 సర్జికల్ పరికరాలు అన్ని ప్రధాన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..