I-Phone 17: ఐఫోన్ 17పై పెరుగుతున్న అంచనాలు.. రీడిజైన్‌‌తో మార్పులెన్నో..?

|

Jan 25, 2025 | 3:30 PM

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అంటే యువతకు ఉన్న క్రేజ్ వేరు. ఐఫోన్ లుక్‌తో పాటు దాంట్లో భద్రతా ఫీచర్ల కారణంగా ఎక్కువ ఐఫోన్ వాడకాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఐఫోన్ తయారీ సంస్థ అయిన ఆపిల్ కూడా ప్రతి ఏడాది ఓ కొత్త మోడల్ రిలీజ్ చేస్తూ యువతను ఆకర్షిస్తుంది. 2025లో ఆపిల్ కంపెనీ ఐఫోన్-17ను లాంచ్ చేయనుంది.

I-Phone 17: ఐఫోన్ 17పై పెరుగుతున్న అంచనాలు.. రీడిజైన్‌‌తో మార్పులెన్నో..?
I Phone 17
Follow us on

యాపిల్ కంపెనీ ప్రతి ఏడాది సెప్టెంబర్ నాటికి తన కొత్త మోడల్ ఐఫోన్‌ను రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం సెప్టెంబరు నాటికి ఐఫోన్-17 సిరీస్‌ లాంచ్ చేసింది. ఐఫోన్ 17 లైనప్‌లో ప్రో, మ్యాక్స్, బేస్ వేరియంట్‌లతో పాటు పరిచయం చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఐఫోన్-17ను కొత్త స్లిమ్ మోడల్‌లో లాంచ్ చేయనుంది. ఇంకో ఎనిమిది నెలల్లో ఐఫోన్-17 లాంచ్ చేయనుండగా ఆ ఫోన్‌కు సంబంధించిన అనేక లీక్‌లు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. యాపిల్ ఇటీవల ఐఫోన్ మోడల్‌లలో స్థిరమైన హార్డ్‌వేర్ డిజైన్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన ఐఫోన్ 16 సిరీస్ కూడా దాని గత ఫోన్ మాదిరి డిజైన్‌‌తోనే వచ్చింది. అయితే ఐఫోన్-17 సిరీస్ ముఖ్యంగా దాని కెమెరా మాడ్యూల్‌లో గణనీయమైన మార్పులతో వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ప్రముఖ టిప్‌స్టర్ మజిన్ బు తెలిపిన వివరాల ప్రకారం ఐఫోన్-17లో విజర్-శైలి కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉండవచ్చని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేశాడు. ఈ మేరకు లీకైన ఫొటో బట్టి ఫోన్ వెనుక ప్యానెల్ ఎగువన ఉన్న పిల్ ఆకారపు కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఈ కొత్త డిజైన్‌లో ఎడమ వైపున ఒకే పెద్ద కెమెరా కటౌట్ ఉంటుంది. ఈ లుక్ గత ఐఫోన్‌లకు భిన్నంగా ఉంటుంది. లీకైన డిజైన్ గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లకు పోలికలను కలిగి ఉందని కొందరు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

విజర్-శైలి కెమెరాతో ఐఫోన్-17 లాంచ్ చేస్తుండగా ఐఫోన్-16 సిరీస్‌కు సంబంధించిన బేస్ వేరియంట్ కోసం వెర్టికల్ కెమెరా లేఅవుట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ప్రో, మ్యాక్స్ మోడల్‌ ఐఫోన్-11 నుంచి ఈ డిజైన్‌ను అనుకరిస్తుంది. అప్‌డేటెడ్ కెమెరా డిజైన్ గురించి పుకార్లతో, ఆపిల్ అభిమానులు ఐఫోన్-17 లాంచ్ కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నారు. లీకైన డిజైన్ నిజమైతే ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడక క్లిక్ చేయండి